బాలీవుడ్ నటుడు ముజామిల్ ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేతో లవ్, డేటింగ్, రొమాంటిక్ రైడ్స్ గురించి హాట్ కామెంట్లు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి. తీవ్ర చర్చకు దారితీశాయి.
నటుడు ముజామిల్ ఇబ్రహీం తాజా ఇంటర్వ్యూలో దీపికా పదుకొణేతో రెండేళ్లు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్ తో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో దీపికాతో రిలేషన్ గురించి చెప్పేందుకు ముజామిల్ కాస్త సంకోచించాడు. దీపికా ఇప్పుడు వివాహం చేసుకున్నందున మాట్లాడటానికి ఆలోచించాడు. కానీ ఆ తర్వాత అన్ని డీటెయిల్ గా చెప్పాడు. 'క్యూట్' డేట్స్ గురించి కూడా వివరించాడు. డేటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలూ చెప్పాడు.
దీపికా, ముజామిల్ మోడల్స్ గా ఉన్నప్పుడు కలిశారని తెలిసింది. అతను స్టార్ గా మారిన తర్వాత కూడా ముజామిల్ తో దీపిక్ ఉందని చెప్పాడు. "నేను బాంబేలో కలిసిన మొదటి వ్యక్తి ఆమె (దీపిక). ఆమె నా మొదటి సీరియస్ రిలేషన్. అంతకుముందు నేను బ్యాడ్ రిలేషన్ షిప్ లో ఉండేవాణ్ని. దీపిక చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేది. ఎందుకంటే ఆమె ప్రకాష్ పదుకొణే కూతురు. అప్పటికే ఆమె గురించి వార్తలు రాసేవారు’’ అని ముజామిల్ తెలిపాడు.
దీపికా పదుకొణేనే తనకు ప్రపోజ్ చేసిందని ముజామిల్ చెప్పడం గమనార్హం. ‘‘ఆమె నాకు ప్రపోజ్ చేసింది కానీ నేను తర్వాత బ్రేక్ అప్ చెప్పా. ఆ సమయంలో నేను స్టార్. ఆమె అప్పుడే మోడలింగ్ ప్రారంభించింది. ఆమె ఇప్పుడు సూపర్ స్టార్.. నన్ను ఎవరూ గుర్తుపట్టరు" అని ముజామిల్ చెప్పాడు. బ్రేక్ అప్ అయిన కొన్ని సంవత్సరాల వరకూ తాము మంచి స్నేహితులుగా ఉన్నారని, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారని ముజామిల్ తెలిపాడు.
"మేము డేటింగ్ చేసినప్పుడు ఇద్దరం చిన్న వయస్సు వాళ్లమే. మేము రిక్షాలో వర్షంలో డేట్స్ కి వెళ్లేవాళ్ళం. అది చాలా క్యూట్ గా ఉండేది. నేను కారు కొన్నప్పుడు, నేను ఆమె కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని దీపిక చాలా సంతోషించింది. మాకు ఇద్దరికీ ఎక్కువ డబ్బు లేదు కానీ మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. నేను నా డీజే ఫ్రెండ్ ని ఆమె బర్త్ డే రోజున ఆమెకు ఇష్టమైన పాటను ఒకటిన్నర గంటలు ప్లే చేయమని అడిగా. మా అమ్మ కూడా ఆమెను చాలా ఇష్టపడింది" అని ముజామిల్ పేర్కొన్నాడు.
దీపికా ఎదిగిన తీరు చూసి తనకు ఎప్పుడూ అసూయ కలగలేదని ముజామిల్ అన్నాడు. దీపికాకు రణవీర్ సింగ్ అనే ప్రేమించే భర్త ఉన్నాడని, వారికి దూయా అనే పాప కూడా ఉందని ముజామిల్ చెప్పాడు. పెళ్లి తర్వాత దీపికా పదుకొణేతో మాట్లాడలేదని అతను తెలిపాడు.
2003 గ్లాడ్‌రాగ్స్ మాన్‌హంట్ ఇండియా పేజెంట్‌లో మిస్టర్ ఇండియాగా గెలిచాడు ముజామిల్. అప్పుడే దీపికాను కలిశాడు. 2004లో అతని ఫ్యామిలీ కశ్మీర్ నుంచి ముంబైకి మారింది. 2007లో ధోఖాతో హీరోగా అరంగేట్రం చేశాడు. 2009లో హార్న్ ఓకే ప్లీజ్స్ లో నటించాడు. 2012లో విల్ యు మ్యారీ మీ? చేశాడు. 2013 చిత్రం ఏ జవాని హై దీవానిలో అదిత్య రాయ్ కపూర్ పాత్రకు తొలుత ఆయననే ఎంచుకున్నారని గుర్తుచేసుకున్నాడు. దీనిలో రణబీర్ కపూర్, దీపికా నటించారు. 2020లో హాట్‌స్టార్ సిరీస్ స్పెషల్ ఆప్స్‌లో కనిపించాడు ముజామిల్.
సంబంధిత కథనం