Murali Mohan About Astrid Dermatology Clinic: డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్'ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ ప్రారంభించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కేబీఆర్ పార్క్ ఎదురుగా టీడీపీ ఆఫీస్ రోడ్‌లో జిమ్ ఖానా క్లబ్ పక్కన ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ఏకాదశి పండుగ రోజున మురళి మోహన్ ప్రారంభించారు. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్‌కు ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్‌లో అత్యంత ఆధునిక, మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని మురళి మోహన్ తెలిపారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నటులు భాస్కర్, సీనియర్ పాత్రికేయులు జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ నిర్మాత, సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. "ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్‌ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. మంచి స్పేషియస్‌గా అందమైన ఇంటీరియర్‌తో, లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్‌తో ఈ క్లినిక్‌ను డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి గారు, వారి హస్బండ్ ఏర్పాటు చేశారు" అని తెలిపారు.
"బంజారాహిల్స్, జుబ్లీహిల్స్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఇది. ఇక్కడి వారంతా ది బెస్ట్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్ మెంట్ కోసం ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ సేవల్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ క్లినిక్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అని మురళి మోహన్ అన్నారు.
"మనవూరి పాండవులు సినిమాలో కీలక పాత్రలో నటించిన భాస్కర రావు గారి కొడుకు తేజ, కోడలు డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి కలిసి ఈ ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ ఏర్పాటు చేశారు. మురళీ మోహన్ గారు ఈ క్లినిక్ ప్రారంభించడం సంతోషకరం. ప్రైమ్ లొకేషన్‌లో లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో ఏర్పాటైన ఈ క్లినిక్ సేవల్ని అవసరమైన వారంతా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం" అని సీనియర్ ఫిలీం జర్నలిస్ట్ ప్రభు తెలిపారు.
"లాబెల్ స్కిన్ క్లినిక్‌లో ఏడేళ్లు వర్క్ చేశాను. ఏడేళ్ల అనుభవం తర్వాత సొంతంగా ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కేబీఆర్ పార్క్ ఎదురుగా ప్రారంభించాం. ఇందుకు సపోర్ట్ చేసిన మావారు తేజకు థ్యాంక్స్ చెబుతున్నా. మా క్లినిక్‌ను లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్ గారి చేతుల మీదుగా లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్ మాకు దొరికాయి" అని డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి అన్నారు.
"మా క్లినిక్‌లో స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్‌కు ది బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తాం. కెమికల్ పీలింగ్, లేజర్ హెయిర్ రిడెక్షన్, లేజర్ టోనింగ్, కార్బన్ పీలింగ్, బొటాక్స్, పిల్లర్, యాక్నే ట్రీట్ మెంట్, త్రెడ్ లిఫ్ట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ తదితర చికిత్సలు, పీడియాట్రిక్ డెర్మటాలజీ కూడా అందుబాటులో ఉంది" అని డాక్టర్ అలేఖ్య చెప్పుకొచ్చారు.