Mohan Sharma on Lakshmi: నటి లక్ష్మిపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త మోహన్ శర్మ
Mohan Sharma on Actress Lakshmi: తన మాజీ భార్య, సీనియర్ నటి లక్ష్మిపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు తమిళ నటుడు మోహన్ శర్మ. తనతో ఎప్పుడూ ఉంటానని, పెళ్లి చేసుకోవాలనే ఆమె తనను అప్పుడు కోరారని చెప్పారు. మరిన్ని విషయాలు వెల్లడించారు.

Mohan Sharma: దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో నటి లక్ష్మి చాలా చిత్రాలు చేశారు. ఒకప్పుడు హీరోయిన్‍గా.. ఆ తర్వాత సపోర్టింగ్ పాత్రల్లో చాలా సినిమాల్లో నటించారు. లక్ష్మి హీరోయిన్‍గా నటించిన చాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వివిధ పాత్రల్లోనూ ఆమె మెప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆమె నటించారు. అయితే, లక్ష్మి వ్యక్తిగత విషయాలు కూడా చాలాసార్లు వార్తల్లోకి ఎక్కాయి. తాజాగా, లక్ష్మి మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ.. ఆమెపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను వెల్లడించారు.
లక్ష్మి, మోహన్ కుమార్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 1975లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత భేదాభిప్రాయాలు రావటంతో 1980లో విడిపోయారు. అయితే, తమ వివాహం నుంచి విడాకులు తీసుకునే వరకు కొన్ని విషయాలను తాజాగా ఇండియా గ్లిట్జ్ యూట్యూబ్ ఛానెల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ కుమార్ చెప్పారు.
శునకంలా ఉంటానని చెప్పింది
పెళ్లి చేసుకుంటే జీవితం శునకం (కుక్క)లా తన వెంటే ఉంటానని లక్ష్మి తనతో అప్పుడు చెప్పారని మోహన్ కుమార్ వెల్లడించారు. “షాపింగ్‍కు తీసుకెళతావా అని లక్ష్మి నన్ను అడిగారు. నేను ఆమెను షాప్‍కు తీసుకెళ్లా. ఓ సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగారు” అని మోహన్ కుమార్ చెప్పారు.
నిద్ర పట్టలేదు
పెళ్లి చేసుకుంటావా అని లక్ష్మి అడగడంతో తనకు ఆ రాత్రి నిద్ర పట్టలేదని మోహన్ కుమార్ వెల్లడించారు. “లక్ష్మి చెప్పిన ఆ మాటలకు నేను అప్పుడు షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాకు తొలిసారి ఓ అమ్మాయి ప్రేమను వ్యక్తం చేసింది. నేను లక్ష్మి మాటలను చాలా సీరియస్‍గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసిన ఆమె తన రూమ్‍కు రమ్మని పిలిచారు. నేను వెంటనే హోటల్‍కు వెళ్లాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని ఆమె అడిగారు. అయితే నేను ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నానని, పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పా” అని మోహన్ కుమార్ చెప్పారు.
ఆ రాత్రే భార్యాభర్తలయ్యాం..
తాను లక్ష్మి నుదుటన బొట్టు పెట్టానని, ఆ రాత్రే తాము భార్యభర్తలమయ్యామని మోహన్ కుమార్ చెప్పారు. “నేనూ, తను గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చాం. పెళ్లి అయ్యే వరకు మా మధ్య ఏమీ జరగలేదు. తనను పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం” అని మోహన్ కుమార్ చెప్పారు.
లక్ష్మి తప్పులు చేశారు
సినిమాల్లో బిజీగా ఉన్న కారణంగా పెళ్లి తర్వాత లక్ష్మి, తాను ఎక్కువ సేపు సమయం గడిపేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉండేవని మోహన్ కుమార్ చెప్పారు. అయితే, లక్ష్మి చాలా తప్పులు చేశారని, వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని ఆయన అన్నాడు. తన జీవితంలోకి మరో పురుషుడిని లక్ష్మి రానిచ్చారని మోహన్ కుమార్ ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు.
1980లో మోహన్ కుమార్‌తో విడాకులు తీసుకున్నారు లక్ష్మి. ఆ తర్వాత నటుడు, దర్శకుడు శివచంద్రన్‍ను పెళ్లి చేసుకున్నారు. 1982లో శాంతిని మోహన్ వివాహం చేసుకున్నారు.
టాపిక్