RGV: రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్-actor govind namdev comments on ram gopal varma movies and creativity and addressing satya sarkar company rangeela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv: రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్

RGV: రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 02, 2025 01:30 PM IST

Actor Govind Namdev About Ram Gopal Varma Movies: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆయన దర్శకత్వం వహించిన సత్య, సర్కార్ వంటి చిత్రాల్లో నటించిన యాక్టర్ గోవింద్ నామ్‌దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్జీవీలో క్రియేటివిటీ మారిపోయిందని, ఒకప్పటిలా సినిమాలు తీయట్లేదని, సత్య ఆయనే తీశారా అనే డౌట్ వస్తుందన్నారు.

రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్
రామ్ గోపాల్ వర్మలో క్రియేటివిటీ మారిపోయింది.. ఆయనెనా సత్య తీసిందనే డౌట్ వస్తుంది.. సర్కార్ నటుడు కామెంట్స్

Actor Govind Namdev About Ram Gopal Varma Movies: ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య, సర్కార్ రాజ్ వంటి చిత్రాల్లో నటించిన యాక్టర్ గోవింద్ నామ్ దేవ్. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

క్రియేటివిటీ మారిపోయింది

హిందీ రష్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యాక్టర్ గోవింద్ నామ్ దేవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో తెరకెక్కించిన సినిమాల గురించి, ఆయన క్రియేటివిటీ గురించి కామెంట్స్ చేశారు. యాంకర్ ఆర్జీవీ గురించి, రీసెంట్‌గా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలపై అభిప్రాయం చెప్పమని ప్రశ్నించారు.

పరిస్థితులు నెట్టివేస్తాయి

ఒక స్థాయికి చేరుకున్నాక దర్శకుడు మారిపోయాడని గోవింద్ నామ్ దేవ్ అన్నారు. "ఎవరైనా ఒక స్థాయికి (కీర్తి) చేరుకున్న తర్వాత, అది వారి మనస్సును మారుస్తుంది. అతనికి (రామ్ గోపాల్ వర్మ) కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని నెట్టివేస్తాయి. అతనిలో ఉన్న క్రియేటివిటీ స్థాయి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన చేసే ప్రతి పని మీకు దూరం చేస్తుంది. ఇది పాత రామ్ గోపాల్ వర్మ కాదు" అని బాలీవుడ్ యాక్టర్ గోవింద్ నామ్ దేవ్ తెలిపారు.

మళ్లీ తన గాడిలో పడాలని

"సత్య, సర్కార్, సర్కార్ రాజ్, కంపెనీ, రంగీలా వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవీ మళ్లీ తన గాడిలో పడాలని ఆశిస్తున్నాను. ఆర్జీవీ గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అలాంటి ఫిల్మ్ మేకర్ ఇలా ఎలా మారాడో తెలియట్లేదు" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు గోవింద్ నామ్ దేవ్.

అనుమానం కలుగుతుంది

"ఇటీవల ఆయన చేసిన సినిమాలు చూస్తుంటే సత్య మూవీని ఆయనే తెరకెక్కించారా అనే అనుమానం కలుగుతుంది. బహుశా అతని మనసు మళ్లీ మారిపోవచ్చు. అలా జరగాలని నేను ఆశాభావంతో ఉన్నాను. రామ్ గోపాల్ వర్మ నటుల దర్శకుడు. ఫిల్మ్ మేకింగ్ భాషను మార్చే మంచి చిత్రాలను ఎలా తీయాలో ఆయనకు తెలుసు" అని గోవింద్ నామ్ దేవ్ చెప్పుకొచ్చారు.

తొలిసారిగా సత్య రీ రిలీజ్

ఇదిలా ఉంటే, సుమారుగా 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా సత్య మూవీ జనవరి 27న రీ రిలీజ్ అయింది. దీని గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. "ఈ విజయాన్ని తాగుతూ సెలబ్రేట్ చేసుకున్నాను" అని ఎక్స్‌లో రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు. అలాగే, తాను సిండికేట్ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపిన విషయం తెలిసిందే.

Whats_app_banner

సంబంధిత కథనం