Brahmaji Karmanye Vadhikaraste Teaser Released: టాలీవుడ్‌లో నటుడిగా ఎనలేను గుర్తింపు తెచ్చుకుంటున్నారు బ్రహ్మాజీ. ఇటీవలే బాపు సినిమాలో ప్రధాన పాత్ర పోషించి అందరిని మెప్పించారు. ఇప్పుడు బ్రహ్మాజీ నటించిన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కర్మణ్యే వాధికారస్తే.
వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే "కర్మణ్యే వాధికారస్తే". ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను బయటపెట్టడమే కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ మూవీ కథాంశం.
కర్మణ్యే వాధికారస్తే సినిమాకు అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డీఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరించారు. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు.
కర్మణ్యే వాధికారస్తే సినిమాలో బ్రహ్మాజీతోపాటు శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
విశాఖపట్నం, హైదరాబాద్‌లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్, సారధి స్టూడియోస్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ విభిన్నమైన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ కర్మణ్యే వాధికారస్తే టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా నిలిచిన కర్మణ్యే వాధికారస్తే టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ ప్రారంభంలో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి. వాటిని చేధించడానికి ఓ పోలీస్ బృందం రంగంలోకి దిగుతుంది. శవానికి కవర్ చుట్టడం, ఒకరిని సెమీ న్యూడ్‌గా ఉంచి ఇంటిరాగేట్ చేయడం, ఫైట్, గన్ ఫైరింగ్ సీన్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
సంబంధిత కథనం