Brahmaji: ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్-actor brahmaji comments on rana daggubati in bapu movie trailer launch event and daggubati rana thiruveer speech ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmaji: ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్

Brahmaji: ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 14, 2025 06:33 AM IST

Actor Brahmaji About Rana Daggubati In Bapu Trailer Launch: తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటిపై నటుడు బ్రహ్మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్రహ్మాజీ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ బాపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్
ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్

Actor Brahmaji About Rana Daggubati In Bapu Trailer Launch: వెర్సటైల్ టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో ఒకరిగా నటించిన తెలుగు లేటెస్ట్ సినిమా బాపు. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్

డార్క్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే బాపు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 14న బాపు ట్రైలర్ లాంచ్ చేశారు. బాపు ట్రైలర్ రిలీజ్ లాంట్ ఈవెంట్‌కు స్టార్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరో తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రానా దగ్గుబాటి స్పీచ్

బాపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. "రెగ్యులర్‌కి భిన్నంగా ఉండే ఇలాంటి జోనర్స్ రావడం చాలా అరుదు. ఒక కల్చర్‌ని చూపించే జానర్స్ రావడం ఆడియన్‌గా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. బాపు టీమ్ అందరికీ అల్ ది వెరీ బెస్ట్" అని చెప్పుకొచ్చాడు.

హీరో తిరువీర్ కామెంట్స్

"బాపు టైటిల్ పెట్టగానే నచ్చేసింది. ఇందులో ప్రమోషనల్ కంటెంట్ నా బాల్యానికి తీసుకెళ్లింది. ట్రైలర్‌లో మట్టివాసన కనిపించింది. బ్రహ్మాజీ గారిని ఇలాంటి పాత్రల్లో చూస్తే కడుపునిండిపోయింది. దయ గారు చాలా మంచి సినిమా తీశారు. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని హీరో తిరువీర్ అన్నాడు.

చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో

నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. "రానా లాంటి డౌన్ టు ఎర్త్ హీరోని నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న సినిమాలని ప్రోత్సహించడంలో ముందు ఉంటాడు. తను ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ మేము సడన్‌గా ఆయన డోర్ ఓపెన్ చేసి పిలవగానే మా ఈవెంట్‌కి వచ్చారు. తనని దేవుడు చల్లగా చూడాలి" అని తెలిపారు.

మంచి పేరు రావాలని

"బాపు మంచి కంటెంట్ ఉన్న సినిమా. అందరూ కలసి మంచి ప్రయత్నం చేశాం. రానా దగ్గుబాటి మా ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. బాపు సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అని యాక్టర్ బ్రహ్మాజీ పేర్కొన్నారు.

రెండు సార్లు చూశాను

"బాపు చాలా అందమైన సినిమా. బాపు సినిమా రెండు సార్లు చూశాను. చాల నచ్చింది. ఈ సినిమాకి జెన్యూన్‌‌గా హెల్ప్ చేయాలని అనిపించింది. మన కుటుంబంలో పాత్రలు ఇందులో కనిపిస్తాయి. డైరెక్టర్ దయ మనుషుల ముసుగు తొలగించి ఓ కథ చెప్పాడు. టీం అందరికీ కంగ్రాట్స్. బ్రహ్మాజీ సపోర్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. అందరం చూసి ఈ సినిమాని సపోర్ట్ చేద్దాం" అని మధుర శ్రీధర్ తెలిపారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం