OTT Thriller Movie: మైండ్ బ్లాక్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. మాలీవుడ్‌ని వసూళ్లతో షేక్ చేసి మూవీ
Kishkindha Kaandam OTT: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారు కిష్కింద కాండం సినిమాను బాగా ఎంజాయ్ చేయవచ్చు. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?
మాలీవుడ్‌ని షేక్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింద కాండం’ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. సెప్టెంబరు 12న రిలీజై ఎవరూ ఊహించనిరీతిలో రూ.50 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తో మలయాళంలో ‘కిష్కింద కాండం’ సూపర్ హిట్‌గా నిలిచింది.
కిష్కింద కాండం కథ ఏంటంటే?
ప్రేమించుకుని అజయన్(ఆసిఫ్ అలీ), అపర్ణ(అపర్ణ బాలమురళి) పెళ్లి చేసుకుంటారు. వాస్తవానికి అప్పటికే అజయన్‌కి పెళ్లి అయ్యి.. ఒక కొడుకు కూడా ఉంటాడు. కానీ.. భార్య చనిపోవడంతో అపర్ణని రెండో వివాహం చేసుకుంటాడు. అయితే.. ఈ వివాహమైన కొన్ని రోజులకే మొదటి భార్య కొడుకు మాయమైపోతాడు.
ఆ కుర్రాడు ఎక్కడికి వెళ్లాడు? అజయన్ తండ్రికి ఉన్న వింత సమస్య కారణంగా గన్ మిస్ అవ్వడం.. ఆ గన్‌తో కొంత మంది ప్రాణాలు పోవడం.. ఇలా సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. చివరి వరకూ సినిమాలో ట్విస్ట్‌ను కొనసాగించడంతో పాటు థ్రిల్‌ను ఏమాత్రం తగ్గనీయకుండా దర్శకుడు దినిజిత్ అయ్యతాన్ తెరకెక్కించారు.
కోతుల చుట్టూ స్టోరీ
కిష్కింద కాండం టైటిల్ వెనుక ఒక కారణం ఉంది. కోతులు ఎక్కువగా కనిపించే ఆ ఊర్లో వరుసగా ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. సినిమాలో మిస్టరీని ఛేదిస్తున్న క్రమంలో మనిషి శవం ప్లేస్‌లో కోతి శవం కనిపించడంతో సినిమాపై ఆసక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ట్విస్ట్‌లు, థ్రిల్స్‌తో సినిమాని బాగా ఎంజాయ్ చేయవచ్చు.
స్ట్రీమింగ్ డేట్ ప్రకటన
కిష్కింద కాండం మూవీ ఓటీటీ హక్కుల్ని భారీ ధరకి డిస్నీ+ హాట్‍స్టార్ చేజిక్కించుకోగా.. అక్టోబరులోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ.. నవంబరు ఫస్ట్‌కి వాయిదా పడింది. అయితే.. ఎట్టకేలకి మిస్టరీకి తెరదించుతూ నవంబరు 19 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు అధికారికంగా సోమవారం ప్రకటించింది.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ డిస్నీ+ హాట్‍స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది.