Hero Arvind Krishna: 8 నెలలు అలా బెడ్ మీదే ఉండిపోయాను.. గుప్పెడంత మనసు జగతి మూవీ హీరో కామెంట్స్
Arvind Krishna On A Masterpiece Injury At 1000 Words: టాలీవుడ్‌లో హీరోగా అలరిస్తున్న అరవింద్ కృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 1000 వర్డ్స్. గుప్పెడంత మనసు జగతి అకా జ్యోతి పూర్వాజ్ నటించిన ఏ మాస్టర్ పీస్ సినిమాకు సంబంధించి 1000 వర్డ్స్ స్పెషల్ షో ఈవెంట్‌లో అరవింద్ కృష్ణ ఆసక్తికర విశేషాలు చెప్పాడు.
Hero Arvind Krishna Comments On 1000 Words Movie: ఇట్స్ మై లవ్ స్టోరీ వంటి తొలి సినిమాతో ప్రేక్షకులను అలరించిన హీరో అరవింద్ కృష్ణ తర్వాతి మూవీస్ పెద్దగా ఆడలేదు. ఇటీవలే ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో మూవీ చేశాడు అరవింద్ కృష్ణ.
ఏ మాస్టర్ పీస్ మూవీ
ఇంకా రిలీజ్ కానీ ఏ మాస్టర్ పీస్ మూవీలో గుప్పెడంత మనసు జగతి అకా జ్యోతి రాయ్ (జ్యోతి పూర్వాజ్) కీలక పాత్ర పోషించింది. అయితే, అరవింద్ కృష్ణ నటించిన మరో లేటెస్ట్ మూవీ 1000 వర్డ్స్. ఇటీవల 1000 వర్డ్స్ స్పెషల్ ప్రీమియర్ షో వేశారు. ఈ ఈవెంట్‌లో అరవింద్ కృష్ణ ఆసక్తికర విశేషాలు చెప్పాడు.
ఓసారి ఫొటో షూట్ చేశాను
ఈ సందర్భంగా హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. "1000 వర్డ్స్ ప్రాజెక్ట్‌లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రమణ గారితో ఓ సారి ఫోటో షూట్ చేశాను. మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే నాకు చెప్పండి సర్ అని అన్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, పాత్రను చక్కగానే పోషించానని అనుకుంటున్నాను" అని అన్నాడు.
దేవుడే పంపినట్లు అనిపించింది
"సూపర్ హీరో మూవీ ఏ మాస్టర్ పీస్ షూటింగ్‌లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది నెలలు పని లేకుండా అలా బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తుంది. సంకల్ప్, శివ కృష్ణ, శివ రామ్ చరణ్‌లు ఈ ప్రాజెక్ట్‌కు చాలా కష్టపడ్డారు. వాళ్లు చాలా ఎత్తుకు ఎదుగుతారనిపిస్తుంది" అని హీరో అరవింద్ కృష్ణ తెలిపాడు.
నా కొడుకు తొలిసారి చూశాడు
"మేఘన గారు, బిగ్ బాస్ దివి గారు అద్భుతంగా నటించారు. నూరీ ఈ చిత్రానికి హీరో. నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారిగా నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని 1000 వర్డ్స్ మూవీ హీరో అరవింద్ కృష్ణ చెప్పుకొచ్చాడు.
యాక్టింగ్ రాదు
ఇదే ఈవెంట్‌లో రైటర్ సంకల్ప్ మాట్లాడుతూ.. "నేను రాసిన కథ ఇంత మందికి నచ్చింది. ఇంత మంది చప్పట్లు కొట్టడం చూస్తుంటే ఆనందంగా ఉంది. మా నూరికి యాక్టింగ్ రాదు. చాలా నేర్చుకుని ఎంతో అద్భుతంగా నటించాడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్" అని అన్నారు.
ఎమోషనల్ అయ్యాను
"1000 వర్డ్స్ అద్భుతంగా ఉంది. అసలు టైం ఎలా గడిచిందో అర్థం కాలేదు. క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. అందరూ అద్భుతంగా నటించారు. రమణ గారు ఈ మూవీని చక్కగా తీశారు" అని గుప్పెడంత మనసు జగతి అలియాస్ జ్యోతి పూర్వాజ్ తెలిపారు.
చాలా సపోర్ట్ చేశారు
"మా ఈ ప్రయాణంలో రేణు దేశాయ్ గారు చాలా సపోర్ట్ చేశారు. రమణ గారు ఓ మంచి చిత్రం తీయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలోనే సంకల్ప్ మంచి కథను ఇచ్చారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి థాంక్స్. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. మా కోసమే మా హీరో అరవింద్ కృష్ణ గారు ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది" అని సినిమాటోగ్రాఫర్ శివ రామ్ చరణ్ చెప్పారు.