భార్య, పిల్లలు ఉండగానే.. మరో మహిళతో సంబంధం.. ఆరు నెలల ప్రెగ్నెన్సీ.. ఇప్పుడు రెండో మ్యారేజ్.. ఆ నటుడు ఎవరంటే?-actor and chef madhampatty rangaraj second marriage with stylist joy crizildaa announced six months pregnancy first wife ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  భార్య, పిల్లలు ఉండగానే.. మరో మహిళతో సంబంధం.. ఆరు నెలల ప్రెగ్నెన్సీ.. ఇప్పుడు రెండో మ్యారేజ్.. ఆ నటుడు ఎవరంటే?

భార్య, పిల్లలు ఉండగానే.. మరో మహిళతో సంబంధం.. ఆరు నెలల ప్రెగ్నెన్సీ.. ఇప్పుడు రెండో మ్యారేజ్.. ఆ నటుడు ఎవరంటే?

అప్పటికే మొదటి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఆ నటుడు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళను గర్భవతిని చేశాడు. ఆమెకు ఆరు నెలల ప్రెగ్నెన్సీ వచ్చాక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహమైన వెంటనే తన భార్య ఆరు నెలల ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశాడు. ఇంతకు ఆ నటుడు ఎవరో ఇక్కడ చూసేయండి.

రెండో పెళ్లి చేసుకున్న నటుడు

ఇప్పుడు ఓ తమిళ నటుడు తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అతని పేరు ట్రెండ్ అవుతోంది. మొదటి భార్య, పిల్లలు ఉండగానే అతను రెండో పెళ్లి చేసుకోవడం, వివాహమైన వెంటనే ఆమె ఆరు నెలల గర్భవతి అని ప్రకటించడమే ఇందుకు కారణం. నటుడ, చెఫ్ మదాంపట్టి రంగరాజ్.. స్టైలిస్ట్ జాయ్ క్రిజిల్డాతో తన ఆశ్చర్యకరమైన వివాహంతో వార్తల్లో నిలిచారు. కొన్ని గంటల్లోనే, తాము బిడ్డను ఆశిస్తున్నట్లు దంపతులు ప్రకటించారు.

మొదటి భార్య

మదాంపట్టి రంగరాజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. స్టైలిస్ట్ జాయ్ క్రిజిల్డాను గుడిలో వివాహమాడాడు. అయితే రంగరాజ్ మొదటి భార్య శృతి రంగరాజ్ చేసిన వాదనల కారణంగా ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. ఆదివారం (జులై 27) స్టైలిస్ట్ జాయ్‌, రంగరాజ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేడుకకు సంబంధించిన ఫోటోలను జాయ్ పంచుకుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో "మిస్టర్ అండ్ మిసెస్ రంగరాజ్" అనే శీర్షికతో చిత్రాలను పోస్ట్ చేసింది.

6 నెలల ప్రెగ్నెంట్

రంగరాజ్, జాయ్ పెళ్లి వార్త విని చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే వెంటనే ఆమె ఆరు నెలల ప్రెగ్నెెంట్ అని ప్రకటించి మరింత ఆశ్చర్యానికి గురి చేశారు రంగరాజ్, జాయ్. అంటే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చిందనే విషయం స్పష్టమవుతోంది. జాయ్ మరొక సెట్ చిత్రాలను "బేబీ లోడింగ్ 2025. నేను గర్భవతిగా ఉన్నా. 6వ నెల ప్రెగ్నెన్సీ" అనే శీర్షికతో పోస్ట్ చేసింది.

ఇద్దరు పిల్లలు

రంగరాజ్ కు ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన న్యాయవాది శృతి.. తాను, రంగరాజ్ చట్టబద్ధంగా వివాహం చేసుకున్నామని ఆరోపించారు. ఇది పరిస్థితికి మరింత క్లిష్టతను జోడించింది. ఆమె ఇటీవల వరకు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. తరచుగా వారి ఇద్దరు పిల్లలతో ఫోటోలను పోస్ట్ చేశారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికీ రంగరాజ్‌తో దిగిన ఫొటోలున్నాయి. “మదాంపట్టి రంగరాజ్ భార్య” అనే బయో కూడా ఉంది. వీళ్లు చట్ట ప్రకారం ఇంకా విడాకులు తీసుకోలేదనే విషయం స్పష్టమవుతోంది. అయితే జాయ్ తో రంగరాజ్ పెళ్లి తర్వాత ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మదాంపట్టి రంగరాజ్ ఎవరు?

మదాంపట్టి రంగరాజ్ ఒక ప్రసిద్ధ చెఫ్-నటుడు. అతను 1999లో తన పాక వృత్తిని ప్రారంభించాడు. బెంగళూరులో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించాడు, ఆపై తన స్వస్థలానికి తిరిగి వచ్చి క్యాటరింగ్ వ్యాపారాన్ని స్థాపించాడు. అతని బృందం నటుడు కార్తీతో సహా 400 కంటే ఎక్కువ వివాహాలకు క్యాటరింగ్ చేసింది. రంగరాజ్ తన పాక నైపుణ్యాలతోనే కాకుండా, మెహందీ సర్కస్ వంటి చిత్రాలలో, కూకు విత్ కోమలి కార్యక్రమాలలో కనిపించడం ద్వారా నటనతో కూడా గుర్తింపు పొందాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం