OTT Action Thriller: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు-action thriller movie pothugadda ott release date etv win ott original trailer released movie stream on 30th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు

OTT Action Thriller: తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు

Hari Prasad S HT Telugu
Jan 20, 2025 08:10 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తోంది ఓ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సోమవారం (జనవరి 20) రిలీజైన ట్రైలర్లోనే ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ పోతుగడ్డ గురించే మనం మాట్లాడుకుంటోంది.

తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు
తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలోకి.. ట్రైలర్‌లోనే ఊహకందని ట్విస్టులు

OTT Action Thriller: యాక్షన్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో మూవీ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు పోతుగడ్డ. చాలా రోజులుగా మూవీ గురించి చెబుతూ వస్తున్న ఈటీవీ విన్ ఓటీటీ.. తాజాగా సోమవారం (జనవరి 20) ట్రైలర్ రిలీజ్ చేసింది. రాజకీయ చదరంగంలో చిక్కుకున్న ప్రేమ జంట చుట్టూ తిరిగే కథతో మూవీ రానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

పోతుగడ్డ ట్రైలర్

ఈటీవీ విన్ ఒరిజినల్ గా తెరకెక్కిన మూవీ పోతుగడ్డ. గతేడాది నుంచే ఈ సినిమా గురించి ఆ ఓటీటీ చెబుతూ వస్తోంది. మొత్తానికి ఈ నెల 30 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసిన ఈటీవీ విన్.. సోమవారం (జనవరి 20) ట్రైలర్ రిలీజ్ చేసింది. సినిమాపై అంచనాలు పెంచేలా ట్విస్టులతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఓ ప్రేమ జంట, ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు, వాళ్ల ద్వారా ప్రమాదంలో చిక్కుకునే ఓ బస్సు చుట్టూ ఈ ట్రైలర్ సాగింది.

ట్రైలర్ మొదట్లోనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఓ ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. వాళ్లిద్దరూ కర్నూలు, రాయచోటి బస్సు ఎక్కుతారు. అయితే అదే బస్సులో ఎన్నికల్లో పంచడం కోసం అంటూ రూ.50 కోట్లు తీసుకెళ్తుంటారు ఓ రాజకీయ నేతకు సంబంధించిన వ్యక్తులు.

ఆ డబ్బు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటర్లకు చేరకూడదంటూ ఆ బస్సునే లక్ష్యంగా చేసుకుంటారు ఆ నేత ప్రత్యర్థి వర్గం వాళ్లు. ఈ క్రమంలోనే ఆ బస్సుపై దాడి చేస్తారు. ఈ రాజకీయ ప్రత్యర్థుల దాడి, ప్రతిదాడిలో ఆ ప్రేమ జంటకు ఏం జరుగుతుందన్నది ఈ మూవీలో చూడొచ్చు. అయితే ట్రైలర్ చివర్లో ఆ ఇద్దరు ప్రేమికులు కూడా చేతుల్లో పిస్తోళ్లు పట్టుకొని సై అనే సీన్ మూవీపై ఆసక్తి రేపింది.

పోతుగడ్డ ఓటీటీ రిలీజ్ డేట్

పోతుగడ్డ మూవీ నిజానికి గతేడాది నవంబర్ 14నే స్ట్రీమింగ్ అవుతుందని ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. అయితే తర్వాత స్ట్రీమింగ్ ను వాయిదా వేసింది. ఇప్పుడు రెండున్నర నెలల తర్వాత జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈమధ్యే ఈటీవీ విన్ తెలిపింది. పోతుగడ్డ మూవీని ఓ ప్రేమ కథ, ఓ రాజకీయ ఆట, సస్పెన్ష్ తో నిండిన యుద్ధంగా గతంలో ఈటీవీ విన్ అభివర్ణించింది.

ఎ టేల్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ పోతుగడ్డ మూవీ వస్తోంది. ఈ పోతుగడ్డ మూవీని రక్ష వీరన్ డైరెక్ట్ చేశాడు. అయితే చాలా వరకు ఈ సినిమాలో కొత్త వాళ్లే లీడ్ రోల్స్ చేశారు. శత్రు, ప్రశాంత్ కిశోర్ లాంటి వాళ్లు నటించారు. అనుపమ చంద్ర, శరత్ చంద్ర మూవీని ప్రొడ్యూస్ చేశారు.

శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. ఈ పోతుగడ్డ మూవీ ఆసక్తి రేపుతోంది. ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను చాలా తక్కువ మొత్తానికే సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తుండటంతో ఈ పోతుగడ్డ మూవీని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం