OTT Action Thriller: 16 ఏళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ.. నెలరోజుల్లోనే ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
Action Thriller OTT: కోలీవుడ్ సీనియర్ హీరో మోహన్ దాదాపు పదహారేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హరా పేరుతో ఓ మూవీ చేశాడు. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే హరా మూవీ ఓటీటీలోకి రాబోతోంది. జూలై 5 నుంచి ఆహా ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Action Thriller OTT: మోహన్ తెలుగుతో పాటు తమిళంలో పలు విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించాడు. 1980- 90దశకంలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించిన మోహన్ లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తమిళంలో వందకుపైగా సినిమాలు చేసిన మోహన్ తెలుగులో బాపు, జంధ్యాల వంటి దర్శకుల సినిమాల్లో హీరోగా కనిపించాడు.
తూర్పువెళ్లేరైలు, స్రవంతి, చూపులు కలిసిన శుభవేళ తో పాటు పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. 2008లో రిలీజైన తమిళ మూవీ సుట్ట ఫజమ్ తర్వాత సినిమాలకు దూరమయ్యారు మోహన్. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరిస్తూ వచ్చారు.
పదహారేళ్ల తర్వాత...
దాదాపు పదహారేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ తమిళంలో హరా పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేశాడు. మోహన్ రీఎంట్రీ మూవీ కావడంతో రిలీజ్‌కు ముందు హరాపై బజ్ ఏర్పడింది. జూన్ 7న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. నెల రోజుల గ్యాప్‌లోనే హరా మూవీ ఓటీటీలోకి వస్తోంది.
ఆహా ఓటీటీ...
జూలై 5 నఆహా తమిళ్ ఓటీటీలో హరా మూవీ రిలీజ్ కాబోతోంది. హరా మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. స్పెషల్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ సినిమాలో మోహన్‌తో పాట అనుమోల్, యోగిబాబు, చారుహాసన్ కీలక పాత్రల్లో నటించారు.
తొలుత ఈ సినిమాలో ఖుష్బూను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని సీన్స్‌ను మోహన్, ఖుష్బూ కాంబినేషన్‌లో షూట్ చేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌కు యాక్సిడెంట్ జరగడం, ఇతర కారణాల వల్ల హర షూటింగ్ చాలా రోజుల పాటు నిలిచిపోయింది. ఈ డిలే కారణంగా ఖుష్పూ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో అనుమోల్‌ను తీసుకున్నారు.
హరా కథ ఇదే...
రామ్ (మోహన్), నీలా (అనుమోల్) తన భార్యతో కలిసి ఊటీలో సంతోషంగా జీవిస్తుంటాడు. వారికి నిమిషా (స్వాతి) అనే కూతురు ఉంటుంది. కోయంబత్తూర్‌లో చదివే నిమిషా ఆత్మహత్య చేసుకుంటుంది. కూతురి మరణం వెనుక మెడికల్ మాఫియా ఉందనే నిజం రామ్‌కు తెలుస్తుంది. ఆ మెడికల్ మాఫియాను ఎదురించడానికి దావూద్ ఇబ్రహీం గా కొత్త అవతారం ఎత్తుతాడు రామ్.
ఈ పోరాటంలో రామ్‌కు ఏమైంది? తన కూతురి మరణంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? సొసైటీలోని అవినీతిని నిర్మూలించాలనే రామ్ ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. సినిమా కాన్సెప్ట్, టేకింగ్, మేకింగ్ నేటితరం ప్రేక్షకుల అభిరుచులకు దూరంగా ఉండటంతో ఫస్ట్ వీక్‌లోనే థియేటర్లలో ఈ మూవీ కనిపించకుండాపోయింది.