Acharya Temple set on fire: రూ.23 కోట్ల సెట్ కాలి బూడిదైంది.. ఆచార్య ధర్మస్థలి ఆలయ సెట్ అగ్నికి ఆహుతి-acharya temple set on fire on monday february 27th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Acharya Temple Set On Fire On Monday February 27th

Acharya Temple set on fire: రూ.23 కోట్ల సెట్ కాలి బూడిదైంది.. ఆచార్య ధర్మస్థలి ఆలయ సెట్ అగ్నికి ఆహుతి

Hari Prasad S HT Telugu
Feb 27, 2023 10:23 PM IST

Acharya Temple set on fire: రూ.23 కోట్ల సెట్ కాలి బూడిదైంది.. ఆచార్య ధర్మస్థలి ఆలయ సెట్ అగ్నికి ఆహుతి అయింది. ఓ వ్యక్తి చేసి తప్పుకు అంత భారీ సెట్ మంటల్లో చిక్కుకుంది.

మంటల్లో ధర్మస్థలి టెంపుల్ సెట్
మంటల్లో ధర్మస్థలి టెంపుల్ సెట్

Acharya Temple set on fire: మెగాస్టార్ చిరంజీవి గతేడాది నటించిన మూవీ ఆచార్య. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. భారీ బడ్జెట్, అంతకు మించిన భారీ సెట్లతో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచింది. చిరు, చరణ్ కలిసి నటించినా ఈ మూవీని కాపడలేకపోయారు.

ఇప్పుడు ఈ మూవీలోని ఆలయ సెట్ అగ్నికి ఆహుతైంది. ఆచార్య మూవీలో ధర్మస్థలి అనే పేరు ఎంత పాపులర్ అయిందో తెలుసు కదా. ఆ ధర్మస్థలిలో వేసిన ఆలయ సెట్ ఇది. ఓ వ్యక్తి ఈ సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో ఇలా బుగ్గిపాలైనట్లు తెలుస్తోంది. ఈ సెట్ పూర్తిగా కాలిపోతున్న వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆచార్య మూవీలో ఈ సెట్ వేయడానికే రూ.23 కోట్లు ఖర్చవడం గమనార్హం. అంత పెద్ద సెట్ పూర్తిగా మంటల్లో చిక్కుకోవడం చూసేవాళ్ల మనసులను కలచివేసింది. మంటలను ఆర్పడానికి దగ్గరలో నీళ్లు కూడా లేనట్లు ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం వినిపించింది. ఈ ఆలయ సెట్ ను సురేశ్ సెల్వరాజన్ వేశాడు.

హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో ఈ సెట్ వేశారు. సుమారు 20 ఎకరాల్లో ఈ సెట్ వేయడం విశేషం. నిజానికి ఇండియాలో ఓ సినిమాకు ఇంత భారీ సెట్ వేయడం ఇదే తొలిసారి అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.

కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయితే ఆ తర్వాత చిరు నటించిన గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య మూవీస్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఆచార్య గాయాన్ని మరచిపోయారు. ఇప్పుడీ సెట్ ఇలా కాలిపోవడంతో మరోసారి ఆ మూవీ వార్తల్లో నిలిచింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం