తనకు సినిమాల్లో మొదటి ఛాన్స్ డైరెక్టర్ అరుముగ కుమార్ ఇచ్చారని విజయ్ సేతుపతి అన్నాడు. ఆయనతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఏస్ సినిమా చేయడం ఆనందంగా ఉందని విజయ్ సేతుపతి చెప్పాడు. అతడు హీరోగా నటించిన ఏస్ మూవీ మే 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతికి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులో బి శివప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఏస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ వేడుకలో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘అరుముగ కుమార్ తో చాలా ఏళ్లుగా స్నేహం ఉంది. నాకు సినిమాల్లో మొదటి ఛాన్స్ ఇచ్చింది ఆయనే. లాంగ్ గ్యాప్ తర్వాత అరుముగ కుమార్‌తో మళ్లీ పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఏస్... యాక్షన్, రొమాన్స్ అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయి. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది" అని అన్నారు.
ఏస్ తర్వాత విజయ్ సేతుపతితో ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను చేయబోతున్నానని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటిస్తామని నిర్మాత బి శివప్రసాద్ పేర్కొన్నారు.
“విజయ్ సేతుపతి ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లా ఏస్ ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ మూవీలో యాక్షన్, కామెడీతో పాటు నవరసాలను పండిస్తూ.. ఆల్‌రౌండర్‌గా విజయ్ సేతుపతి అదరగొట్టారు. ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది” అని డైరెక్టర్ అరుముగ కుమార్ చెప్పారు.
నటుడు బబ్లూ పృథ్వీ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. డార్క్ కామెడీతో రాబోతోన్న ఈ మూవీ అందరిని ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు.
ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో పూరి జగన్నాథ్‌తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీలో టబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఛార్మితో కలిసి పూరి ఈ మూవీ నిర్మిస్తోన్నాడు.