bigg boss 6 telugu: అభియనశ్రీ ఎలిమినేట్ - ఎమోషనల్ అయిన ఫైమా
bigg boss 6 telugu: బిగ్ బాస్ 6 తెలుగు నుంచి అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యింది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన అభినయశ్రీ ...రేవంత్ కన్నింగ్ అంటూ కామెంట్స్ చేసింది.
bigg boss 6 telugu: బిగ్‌బాస్ సీజన్ 6 నుంచి అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యింది. తొలివారం ఎలిమినేషన్స్ లేకపోవడంతో సేఫ్ అయిన అభినయశ్రీకి ఈ వారం మాత్రం లక్ కలిసికాలేదు. ఆటతీరు అనుకున్నంత బాగా లేకపోవడంతో అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యింది.
ట్రెండింగ్ వార్తలు
నామినేషన్స్ లో గీతూ, రాజ్, ఫైమా, రేవంత్, రోహిత్ మరీనా వివిధ టాస్క్ లలో సేఫ్ అవ్వగా చివరగా ఆదిరెడ్డి, అభినయశ్రీ మిగిలిపోయారు. కలర్ టాస్క్ లో అభినయశ్రీ పేరు రావడంతో ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లుగా నాగార్జున ప్రకటించారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన అభినయశ్రీకి ఆమె జర్నీని చూపించారు నాగార్జున.
హౌజ్ లో హానెస్ట్, డిస్ హానెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాలంటూ అభినయశ్రీని నాగార్జున కోరాడు. ఫైమా,బాలాదిత్య, సూర్య, చంటి, శ్రీసత్య హానెస్ట్ పర్సన్స్ అని అభినయశ్రీ పేర్కొన్నది. హౌజ్ లో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యింది ఫైమాతోనే అని, ఆమె వల్లే సంతోషంగా ఉండగలిగానని అభినయశ్రీ పేర్కొన్నది.
అభినయశ్రీ మాటలకు ఫైమా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకున్నది. మంచితనం వల్లే బాలాదిత్య సరిగా ఆడలేకపోతున్నాడంటూ అభియశ్రీ చెప్పింది. బిగ్ బాస్ హౌజ్ లో రేవంత్ కన్నింగ్ పర్సన్ అంటూ అభినయశ్రీ పేర్కొన్నది. అతడు తప్ప డిస్ హానెస్ట్ పర్సన్స్ ఎవరూ లేరని అన్నది.
తమన్నా సందడి...
అంతకుముందు బిగ్ బాస్ హౌజ్ లో తమన్నా సందడి చేసింది. బబ్లీ బౌన్సర్ సినిమాను ప్రమోట్ చేసింది తమన్నా కానుక పేరుతో ఆమె ద్వారా ఓ గిఫ్ట్‌ను హౌజ్‌లోకి పంపించారు నాగార్జున. ఈ సందర్భంగా తమకు లేడీ బౌన్సర్‌గా ఎవరు ఉంటే బాగుంటుందో అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోవాలంటూ నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆదిరెడ్డి, బాలాదిత్య ఇద్దరు గీతూను బౌన్సర్‌గా ఎంచుకున్నారు.
ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య, గీతులలో ఎవరన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నానంటూ చెప్పాడు. శ్రీసత్య పేరును అతడు చెప్పగానే ఆడియోన్స్ కేకలు వేశారు. వారిద్దరి మధ్య ఏదో ఉందని అనడం ఆసక్తిని రేకెత్తించింది. నాగార్జున, తమన్నాతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అర్జున్ కళ్యాణ్‌పై పంచ్‌లు వేశారు.
ఆరోహిని బౌన్సర్ గా ఎంచుకున్న శ్రీహాన్ ఆమెకు బ్యాండ్ కట్టాడు. అర్జున్ నుండి రక్షణ కోసమే ఆరోహిని లేడీ బౌన్సర్‌గా ఎంచుకుంటున్నట్లు చెప్పాడు. మీ రొమాన్స్‌కు నన్ను కాపలాగా ఉండమని అడగటం కరెక్ట్ కాదంటూ అరోహి చెప్పడంతో నవ్వులు పూశాయి.
ఆరోహి రావ్‌ను ఆర్జే సూర్య లేడీ బౌన్సర్‌గా ఎంచుకోవడంతో మరోసారి ఆడియోన్స్ నుంచి అరుపులు వినిపించాయి. ఆ కేకలకు మూడు సంవత్సరాల నుంచి ఏం పుట్టలేదు. ఇప్పుడు ఏం పడుతుంది అని అరోహి అనగానే నిన్ను నేను అడగలేదు అంటూ నాగార్జున సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ఫైమాను చంటి, గీతను రేవంత్ బౌన్సర్స్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పారు.
సూర్య విన్నర్...
తమన్నాను ఇంప్రెస్ చేసిన వారికే ఆమె కానుక అందుతుంది అని నాగార్జున ప్రకటించారు. రేవంత్, రోహిత్, సూర్య, అర్జున్ కళ్యాణ్ లకు అవకాశం దక్కింది. అందులో రేవంత్ పాట పాడి తమన్నాను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. రోహిత్, అర్జున్ ఆమెను పొగిడారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వాయిస్ ను ఇమిటేట్ చేసి తమన్నాను ఇంప్రెస్ చేశాడు సూర్య. అతడికి ఆరోహి ద్వారా ఆ కానుకగా అందించాడు నాగార్జున.
గజిబిజి గానా...
కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టి గిజిబిజి గానా గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో రేవంత్ టీమ్ గెలుపొందింది. మధ్యలో ఇచ్చిన కోన్ టాస్క్, కలర్ టాస్క్ లో రేవంత్, ఫైమా, రోహిత్ మరీనా సేఫ్ అయ్యారు.