Aha OTT: ఆహా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోన్న కామెడీ మూవీ -అలాంటి వారికి ఓ ఎగ్జాంపుల్ ఈ సినిమా!
Aha OTT: ఆహా ఓటీటీలో రిలీజైన మై డియర్ దొంగ మూవీ రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది. ఈ కామెడీ మూవీలో అభినవ్ గోమటం, షాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు.
Aha OTT: అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అదరగొడుతోంది. ఆహా ఓటీటీలో రిలీజైన ఈ కామెడీ మూవీలో షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటిస్తూ కథను అందించింది. దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు.

మై డియర్ దొంగ మూవీకి బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. థియేటర్లను స్కిప్ చేస్తూ ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. సినిమా విడుదలై వారం దాటినా ఆహా ఓటీటీలో టాప్ ఫైవ్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా మై డియర్ దొంగ మూవీ నిలిచింది.
హానెస్ట్‌గా వర్క్ చేస్తే...
ఈ సందర్భంగా బుధవారం మై డియర్ దొంగ సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ వేడుకలో హీరోయిన్ కమ్ రైటర్ షాలిని మాట్లాడుతూ... మై డియర్ దొంగ మూవీకి వస్తోన్న రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని కలిగిస్తోన్నాయి. ఇంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. మంచి కంటెంట్ నమ్మి హానెస్ట్ గా సినిమా చేస్తే విజయం తప్పకుండా వరిస్తుందనడానికి మై డియర్ దొంగ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. నేను రాసిన కథని దర్శకుడు గొప్పగా అర్ధం చేసుకొని మరింత గొప్పగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. అందరికీ రికమెండ్ చేసే చిత్రమిది. యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకు ప్రతి ఒక్కరూ మూవీని ఎంజాయ్ చేస్తారు అని తెలిపింది.
నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగ విజయంపై మొదటి నుంచి చాలా నమ్మకంగా వున్నాం. మా నమ్మకం నిజమైంది. అభినవ్ గోమటం కామడీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నాడు.
అల్లు అరవింద్‌కు నచ్చింది...
హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘చిన్న సినిమాకు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించారు. తొలి సినిమాతోనే రైటర్‌గా తనను తాను షాలిని ప్రూవ్ చేసుకున్నది. గొప్ప ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్‌కు మా సినిమా నచ్చడం ఆనందంగా ఉంది అని చెప్పాడు.
మై డియర్ దొంగ కథ ఇదే...
ప్రేమలో బ్రేకప్ అయిన బాధలో మునిగిపోయిన సుజాత అనే యువతి ఇంట్లోకి ఓ దొంగ వస్తాడు. తన మంచితనంతో సుజాత మనసును ఆ దొంగ ఎలా దోచేశాడు? సుజాత ఇష్టాలు, ఆలోచనలను అతడు ఎలా గ్రహించాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.
వెబ్‌సిరీస్‌లు, సినిమాలు...
తెలుగులో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీగా అభినవ్ గోమటం. ఇటీవలే మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో డైరెక్టర్‌గా మారాడు. అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ సీజన్ 2 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌లో అభినవ్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. చూసీ చూడంగానే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని ప్రస్తుతం సుహాస్‌తో కేబుల్ రెడ్డి అనే మూవీ చేస్తోంది. అల్లుడుగారు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.