Aavesham OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?-aavesham ott streaming fahadh faasils malayala crime comedy movie makes it ott debut on prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aavesham Ott Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Aavesham OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Published May 09, 2024 03:21 PM IST

Aavesham OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసింది ఈ మధ్యే వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆవేశం. ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా రూ.150 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Aavesham OTT Streaming: మలయాళ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ మూవీ గురువారం (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ లేకపోయినా సడెన్ గా వచ్చేసి సర్‌ప్రైజ్ చేసింది. దీంతో ఫఫా (ఫహాద్ ఫాజిల్) ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.

ఆవేశం ఓటీటీ స్ట్రీమింగ్

ఈ ఏడాది వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ మలయాళ మూవీ ఆవేశం. ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన నాలుగో మలయాళ సినిమా ఇది. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. కేరళలోని థియేటర్లలో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. అయినా మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

గురువారం (మే 9) నుంచి ఆవేశం మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం మలయాళం వెర్షన్ మాత్రం అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ జానర్ మూవీని థియేటర్లలో ప్రేక్షకులు బాగా ఆదరించారు. గ్యాంగ్‌స్టర్ రంగా అనే పాత్రలో ఫహాద్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. క్లైమ్యాక్స్ వరకు అసలే ఫైటే చేయని ఈ ఫన్నీ గ్యాంగ్‌స్టర్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఆవేశం మూవీ ఓటీటీలోకి వచ్చేయడంతో పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఫహాద్ రంగా పాత్రలో జీవించేశాడని ఒకరు, ఈ మూవీలో అసలు ఏముంది.. ఎందుకింత హైప్ ఇచ్చారని మరొకరు.. ఓ గ్యాంగ్‌స్టర్ ఇలా కామెడీ చేయడం చూడలేని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు.

భారీ లాభాల్లో ఆవేశం మేకర్స్

రూ.30 కోట్లతో ఈ ఆవేశం మూవీ తెరకెక్కింది. కానీ ఇప్పటికే థియేటర్లలో రూ.150 కోట్లకుపైనే వసూలు చేసింది. ఇది కాకుండా డిజటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.35 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో మేకర్స్ పై లాభాల వర్షం కురుస్తోంది. ఆవేశం మూవీ ఫహాద్ ఫాజిల్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కావడం విశేషం.

అంతేకాదు మంజుమ్మల్ బాయ్స్, 2018, పులి మురుగన్, ది గోట్ లైఫ్ తర్వాత రూ.150 కోట్లకుపైగా వసూలు చేసిన ఐదో మలయాళ సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో ఫహాద్ నటనే ప్రధాన బలంగా కనిపిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఇతర భాషల ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలను ఆదరిస్తున్న నేపథ్యంలో ప్రైమ్ వీడియోలో సబ్ టైటిల్స్ తోనూ ఈ మూవీని చూసేస్తున్నారు.

ఏప్రిల్ 11న రిలీజై సంచలన విజయం సాధించినా.. నెలలోపే ఓటీటీలోకి ఆవేశం మూవీ వచ్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేరళ నుంచి బెంగళూరు వచ్చిన ముగ్గురు కాలేజీ స్టూడెంట్స్ అక్కడ తమను వేధిస్తున్న వ్యక్తి పని పట్టాల్సిందిగా రంగా అనే గ్యాంగ్ స్టర్ ను కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని ఫహాద్ భార్య నజ్రియాతోపాటు అన్వర్ రషీద్ నిర్మించారు. జీతూ మాధవన్ డైరెక్ట్ చేశాడు.

Whats_app_banner