Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!-aamir khan secret dating rumours and speculations on his third marriage go viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!

Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2025 12:31 PM IST

Aamir Khan: ఆమిర్ ఖాన్ సీక్రెట్ రిలేషన్‍లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన మూడో పెళ్లికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..

Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!
Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలోకి మరో మహిళ వచ్చారంటూ తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమిర్ ప్రస్తుతం సీక్రెట్ రిలేషన్‍లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మూడో పెళ్లి చేసుకోనున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

సీరియస్ రిలేషన్‍షిప్‍లో..!

బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమిర్ ఖాన్ సీరియస్ రిలేషన్‍లో ఉన్నారని ఫిల్మ్‌ఫేర్ రిపోర్ట్ పేర్కొంది. కానీ ఆమె ఎవరో మాత్రం రివీల్ చేయలేమనమంది. “ఆమిర్ మిస్టరీ పార్ట్‌నర్‌ది బెంగళూరు. వారి ప్రైవసీని మేం గౌరవించాలి. అందుకే వివరాలు వెల్లడించడం లేదు. అయితే, ఆమెను ఆమిర్ తన కుటుంబం మొత్తానికి పరిచయం చేశారు. ఈ మీటింగ్ బాగా జరిగింది” అని సంబంధిత వ్యక్తులు చెప్పినట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఆ మహిళను తన కుటుంబానికి 59ఏళ్ల ఆమిర్ ఖాన్ పరిచయం చేశారనే రూమర్ల కారణంగా రావటంతో మూడో పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆమిర్ పెళ్లి చేసుకోనున్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఇద్దరితో విడిపోయిన ఆమిర్

1986లో రీనా దత్తాను సీక్రెట్‍గా పెళ్లి చేసుకున్నారు ఆమిర్ ఖాన్. వీరి వివాహం విషయం చాలా రోజుల తర్వాత బయటికి వచ్చింది. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది మహారాజ్ చిత్రంతో జునైద్ అరంగేట్రం చేశాడు. ఐరా వివాహం కూడా గతేడాదే జరిగింది. కాగా, 2002లోనే రీనా దత్తాతో ఆమిర్ విడిపోయాడు. విడాకులు తీసుకున్నారు. అయితే, జునైద్, ఐరాను ఆమిర్ తన వద్దే ఉంచుకున్నారు.

2005లో కిరణ్ రావ్‍ను ఆమిర్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ సరోగసీ ద్వారా ఆజాద్ అనే కుమారుడిని పొందారు. 2021లో వీరిద్దరూ విడిపోయారు. ఆజాద్‍ను ఇద్దరూ చూసుకుంటున్నారు. తాము భార్యభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా ఉన్నామని ఆమిర్, కిరణ్ రావ్ గతంలో చెప్పారు. కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ చిత్రం 2024లో మంచి హిట్ సాధించడంతో పాటు భారీగా ప్రశంసలను పొందింది. ఈ చిత్రానికి ఆమిర్ ఖాన్ కూడా నిర్మాతగా వ్యవహరించారు.

ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఓ మహిళతో ఆమిర్ రిలేషన్‍లో ఉన్నారనే రూమర్లు వస్తున్నాయి. మూడో పెళ్లి చేసుకునేందుకు రూమర్లు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమిర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ చిత్రం తదుపరి రిలీజ్ కావాల్సి ఉంది. గత డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆమిర్, కిరణ్ రావ్ కలిసి నిర్మించారు. రజినీ కాంత్ తమిళ మూవీ కూలీలో ఆమిర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం