ఆమీర్ ఖాన్ లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘సితారే జమీన్ పర్’ మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం (జూన్ 20) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా రెండు రోజుల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో ఇక్కడ చూసేయండి.
ఆర్ ఎస్ ప్రసన్న డైరెక్షన్ లో వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాలో ఆమీర్ ఖాన్, జెనీలియా దేశ్ ముఖ్ జంటగా నటించారు. తారే జమీన్ పర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ కొట్టిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం సితారే జమీన్ పర్ ఇండియాలో రూ.30.90 కోట్ల నెట్, రూ.37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఓవర్సీస్ లో రూ.13 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లు రాబట్టింది. భారతదేశంలో రూ .10.7 కోట్ల నెట్ ఓపెనింగ్ తరువాత ఈ చిత్రం శనివారం కలెక్షన్లలో 88.79% పెరుగుదలను చూసింది.
రూ.23.75 కోట్లుగా ఉన్న కంగనా రనౌత్ ఎమర్జెన్సీ లైఫ్ టైమ్ కలెక్షన్లను సితారే జమీన్ పర్ అధికారికంగా అధిగమించింది. వారాంతంలో రూ.55.8 కోట్లుగా ఉన్న షాహిద్ కపూర్ దేవా లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా ఈ చిత్రం బీట్ చేస్తుంది. అక్షయ్ కుమార్ నటించిన కేసరి చాప్టర్ 2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్లు వసూలు చేసింది.
'సితారే జమీన్ పర్' విజయం సాధించినందుకు తన భార్య జెనీలియాను రితేష్ దేశ్ ముఖ్ అభినందించారు. 'మంచి రివ్యూలు, బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి నవ్వుకుంటూ నిద్రలేచాను. సంతోషంగా ఉంది. గర్వించదగిన భర్త..... కంగ్రాట్స్ బైకో జెనీలియా" అని పోస్టు చేశాడు రితేష్. మీరు పూర్తిగా నన్ను అర్థం చేసుకున్నారని జెనీలియా రియాక్టయింది. ఈ పోస్ట్ కింద సునీల్ శెట్టి రెడ్ హార్ట్ ఎమోజీతో కామెంట్ చేయగా, భాగ్యశ్రీ 'ఎంత అందమైన పిక్. భగవంతుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు’ అని పేర్కొంది.
సితారే జమీన్ పర్ సినిమాలో ఆరోష్ దత్తా, గోపీ కృష్ణన్ వర్మ, వేదాంత్ శర్మ, నమన్ మిశ్రా, రిషి షహానీ, రిషబ్ జైన్, ఆశిష్ పెండ్సే, సంవిత్ దేశాయ్, సిమ్రాన్ మంగేష్కర్, ఆయుష్ భన్సాలీ తదితరులు కూడా నటించారు. స్పెషల్ ఎబిలిటీస్ ఉండే న్యూరో డైవర్ట్ వ్యక్తులకు బాస్కెట్ బాల్ నేర్పించే కోచ్ గా ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో కనిపించారు.