Telugu News  /  Entertainment  /  Aamir Khan Dance To Papa Kahte Hain Song In His Daughter Engagement
కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థం డ్యాన్స్ తో అదరగొట్టిన ఆమీర్ ఖాన్
కూతురు ఐరా ఖాన్ నిశ్చితార్థం డ్యాన్స్ తో అదరగొట్టిన ఆమీర్ ఖాన్

Aamir Khan Dance Viral: కూతురు నిశ్చితార్థంలో తండ్రి డ్యాన్స్.. వీడియో వైరల్

19 November 2022, 12:42 ISTMaragani Govardhan
19 November 2022, 12:42 IST

Aamir Khan Dance Viral: ఆమీర్ ఖాన్ తన కుమార్తే ఐరా ఖాన్ నిశ్చితార్థం వేడుకలో అదిరిపోయే స్టెప్పులేశారు. తన సినిమాలోని పాపులర్ సాంగ్ పాప కహతే హై అనే పాటకు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Aamir Khan Dance Viral: బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తే ఐరా ఖాన్ నిశ్చితార్థం అంగరంగవైభవంగా జరిగింది. ఆయన మొదటి భార్య రీనా దత్తాకు జన్మించిన ఐరా.. గత కొన్నేళ్లుగా సెలెబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమాయణం కొనసాగిస్తోంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లు పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ కార్యక్రమానికి ఆమీర్ కుటుంబ సభ్యులతో పాటు నుపుర్ కుటుంబ సభ్యులు కూడా విచ్చేశారు. కూతురు నిశ్చితార్థం సందర్భంగా ఆమీర్ డ్యాన్స్ వేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఆమీర్ తన పాపులర్ సాంగ్ పాప్పా కహెతే హై బడా నామ్ కరేగా అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. తన కెరీర్‌లోనే అత్యంత సూపర్ హిట్‌గా నిలిచిన కయమాత్ సే కయామత్ తక్(1988) అనే చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్. అప్పట్లో యంగ్ ఆమీర్ తన క్యూట్ స్టెప్పులతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. తాజాగా మరోసారి ఆ స్టెప్పులతో అదరగొట్టారు. ఆమీర్ తన కజిన్ మన్సూర్ ఖాన్‌తో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. మిగిలిన అతిథులంతా తమ కేరింతలతో ప్రోత్సహించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆమీర్ డ్యాన్స్ చూసి విశేషంగా స్పందిస్తున్నారు. ఓ మై గాడ్ ఈ వీడియోలో ఆమీర్‌ను గుర్తు పట్టలేకపోతున్నా అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. ఆమీర్, మన్సూర్ ఇద్దరూ తండ్రి, కొడుకుల్లానే ఉన్నారంటూ ఇంకో స్పందించారు.

ఈ వేడుకలో ఐరా ఖాన్ ఎరుపు రంగు దుస్తుల్లో మెరవగా.. నుపుర్ సూట్‌లో మెరిశాడు. ఈ కార్యక్రమానికి ఆమీర్ తల్లి జీనత్ హుస్సేన్, వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ఆమీర్ రెండో భార్య కిరణ్ రావు కూడా హాజరైంది. రీనా దత్తా 10 ఏళ్ల కుమారుడు ఆజాద్ రావు బ్లూ సూట్ ధరించి కనిపించాడు. ఆమీర్ సోదరి నిఖత్ ఖాన్, మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.

టాపిక్