Naari Movie: ఆమ‌ని న‌ట విశ్వ‌రూపంతో నారి - చిన్మ‌యి శ్రీపాద సాంగ్ రిలీజ్‌-aamani naari movie release in theaters on womens day chinmayi sripada song unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naari Movie: ఆమ‌ని న‌ట విశ్వ‌రూపంతో నారి - చిన్మ‌యి శ్రీపాద సాంగ్ రిలీజ్‌

Naari Movie: ఆమ‌ని న‌ట విశ్వ‌రూపంతో నారి - చిన్మ‌యి శ్రీపాద సాంగ్ రిలీజ్‌

Nelki Naresh HT Telugu
Published Feb 17, 2025 01:28 PM IST

Naari Movie: సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న‌నారి మూవీ నుంచి నిషిలో శ‌శిలా అనే పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. చిన్మ‌యి శ్రీపాద ఆల‌పించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. నారి మూవీని ఉమెన్స్ డే రోజున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

నారి మూవీ
నారి మూవీ

Naari Movie: సీనియ‌ర్ హీరోయిన్‌ ఆమని ప్ర‌ధాన పాత్ర‌లో నారి పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీలో వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, కార్తికేయ దేవ్, ప్రగతి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సూర్య వంటిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

చిన్మ‌యి శ్రీపాద‌...

నారి మూవీ నుంచి నిషిలో శ‌శిలా అనే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌ను ఫేమ‌స్ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీపాద ఆల‌పించారు. ప్ర‌సాద్ సానా సాహిత్యం అందించారు. వినోద్ కుమార్ విన్ను మ్యూజిక్ అందించాడు.ఈ పాట యూట్యూబ్‌లో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. స్త్రీ గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ లిరిక్స్ సాగాయి. చిన్మ‌యి శ్రీపాద వాయిస్ ఈ పాట‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఏడు మిలియ‌న్ల వ్యూస్‌...

ఓ విద్యార్థిని తన టీచర్‌తో అమ్మాయిలు ఈ సమాజంలో ఎదుర్కొనే కష్టాలు, సమస్యల గురించి చెబుతూ ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఏడు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. అలాగే సినిమాలోని ఈడు మగాడేంట్రా బుజ్జి పాట ఎనిమిది మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మంత్రి సీతక్క రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఉమెన్స్ డే రోజున‌...

మహిళా దినోత్సవం సందర్భంగా నారి సినిమాను మార్చి 7న రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. డైరెక్ట‌ర్‌ సూర్య వంటిపల్లి మాట్లాడుతూ.. ‘ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, మహిళల సమస్యల మీద తీసిన‌ మూవీస్ హిట్ట‌యిన దాఖ‌లాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఆ హిట్ సినిమాల‌ జాబితాలో నారి చేరుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఈ సినిమాలో ఆమని గారి నట విశ్వరూపం చూస్తారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. అందరినీ ఆలోచింపజేసేలా మంచి సినిమా ఇది* అని చెప్పాడు. .మహా శివరాత్రి సందర్భంగా నారి ట్రైలర్‌ను రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని నిర్మాత ప్ర‌క‌టించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి...

తెలుగులో ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు టీవీ సీరియ‌ల్స్ చేస్తోంది అమ‌ని. గ‌త ఏడాది లీలా వినోదం, మ్యూజిక్ షాక్ మూర్తి, మా నాన్న సూప‌ర్ హీరోతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

సీరియ‌ల్స్‌....,

స్టార్‌మాలో టెలికాస్ట్ అవుతోన్న ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్‌లో వేదావ‌తి పాత్ర‌లో అమ‌ని న‌టిస్తోంది. అలాగే కొత్త‌గా రెక్క‌లొచ్చేనా తెలుగు సీరియ‌ల్‌లో ఆమ‌ని కీల‌క పాత్ర పోషిస్తోంది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner