Aadikeshava Review: ఆదికేశ‌వ రివ్యూ - మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ మాస్ సినిమా ఎలా ఉందంటే?-aadikeshava review vaishnav tej sreeleela mass action entertainer movie review sithara entertainments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadikeshava Review: ఆదికేశ‌వ రివ్యూ - మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ మాస్ సినిమా ఎలా ఉందంటే?

Aadikeshava Review: ఆదికేశ‌వ రివ్యూ - మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ మాస్ సినిమా ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu

Aadikeshava Review: వైష్ణ‌వ్‌తేజ్‌, శ్రీలీల జంట‌గా న‌టించిన ఆదికేశ‌వ మూవీ న‌వంబ‌ర్ 24న (శుక్ర‌వారం) థియేట‌ర్ల‌లో రిలీజైంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే..

వైష్ణ‌వ్‌తేజ్‌, శ్రీలీల

Aadikeshava Review: ఉప్పెన‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌. తొలి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న వైష్ణ‌వ్‌తేజ్‌ మాస్ బాట ప‌ట్టాడు . అత‌డు హీరోగా న‌టించిన ఆదికేశ‌వ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మాస్ మూవీతో వైష్ణ‌వ్‌తేజ్ ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? ఆదికేశవ తో అత‌డికి హిట్ ద‌క్కిందా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

బాల‌కోట‌య్య క‌థ‌...

బాల‌కోట‌య్య అలియాస్ బాలు (వైష్ణ‌వ్‌తేజ్‌) ఎలాంటి బ‌రువుబాధ్య‌త‌లు లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. కొడుకు బ‌లాదూర్‌గా తిర‌గడం తండ్రికి (జ‌య‌ప్ర‌కాష్‌) న‌చ్చ‌దు. తండ్రి బ‌ల‌వంతం మేర‌కు ఓ మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీ ఇంట‌ర్వ్యూకి అటెండ్ అవుతాడు. బాలు ప్ర‌తిభ‌, వ్య‌క్తిత్వం న‌చ్చి ఆ కంపెనీ సీఈవో చిత్రావ‌తి అలియాస్ చిత్ర (శ్రీలీల‌) అత‌డికి ఉద్యోగం ఇస్తుంది.

తొలిచూపులోనే చిత్ర‌తో బాలు ల‌వ్‌లోప‌డ‌తాడు. చిత్ర కూడా బాలును ఇష్ట‌ప‌డుతుంది. కానీ వారి ప్రేమ‌ను చిత్ర తండ్రి వ్య‌తిరేకిస్తాడు. ఆ గొడ‌వ‌లోనే బాలు గ‌తం బ‌య‌ట‌ప‌డుతుంది. బాలు రాయ‌ల‌సీమ‌కు చెందిన ఎమ్మెల్యే మ‌హాకాలేశ్వ‌ర్‌రెడ్డి (సుమ‌న్‌)కొడుకు అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. అత‌డి అస‌లు పేరు బాలు కాద‌ని రుద్ర కాలేశ్వ‌ర్‌రెడ్డి అని కూడా తెలుస్తుంది.

రాయ‌ల‌సీమ‌కు బాలు ఎందుకు దూర‌మ‌య్యాడు? బాలు తండ్రి మ‌హాకాలేశ్వ‌ర్‌రెడ్డి ఎలా చ‌నిపోయాడు? త‌న తండ్రి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన మైనింగ్ వ్యాపారి చెంగారెడ్డి(జోజుజార్జ్‌)పై బాలు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు అన్న‌దే ఆదికేశ‌వ సినిమా క‌థ‌.

ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీ...

ఆదికేశ‌వ‌ మాస్ మాసాల హంగుల‌తో కూడిన ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీ. హీరో ప్రేమ‌కు హీరోయిన్ తండ్రి అడ్డుచెప్ప‌డం, హీరోకు ఓ పెద్ద ప్లాష్‌బ్యాక్ ఉండ‌టం, విల‌న్‌పై రివేంజ్ కోసం సీమ‌లో అడుగుపెట్ట‌డం అనే కాన్సెప్ట్‌తో తెలుగు తెర‌పై ఎన్నో సినిమాలొచ్చాయి. వాటి ఛాయ‌ల‌తోనే ఆదికేశ‌వ సినిమా సాగుతుంది.

క‌థ, క‌థ‌నాల విష‌యంలో కొత్త‌ద‌నం ఉండ‌ద‌ని ప్ర‌మోషన్స్‌లోనే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చి ఆడియెన్స్‌ను ముందుగానేప్రిపేర్ చేశారు. అందుకు త‌గ్గ‌ట్లే ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్ క‌ట్ చేశారు. వారి మాట‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమా ఆద్యంతం రోటీన్‌గా సాగుతుంది. హీరో ఫ్లాష్‌బ్యాక్ బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడే క్లైమాక్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది అర్థ‌మైపోతుంది. సీమ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సినిమాల‌న్ని గుర్తొస్తాయి.

మాస్ హీరోగా నిల‌బెట్టాల‌ని...

వైష్ణ‌వ్‌తేజ్‌ను మాస్ హీరోగా నిల‌బెట్టాల‌నే తాప‌త్ర‌యంతోనే ఈ సినిమా తీసిన‌ట్లుగా అనిపిస్తుంది. వైష్ణ‌వ్‌తేజ్ ఎలివేష‌న్స్‌, బిల్డ‌ప్ షాట్స్ పైనే ఎక్కువ‌గా డైరెక్ట‌ర్ ఫోక‌స్ పెట్టారు. క‌థ‌, ఎమోష‌న్స్ లేకుండా కేవ‌లం యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో ప్రేక్ష‌కుల్ని అట్రాక్ట్ చేసి పాస్ అయిపోవాల‌ని అనుకున్నారు. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో అతి భ‌రించ‌డం క‌ష్ట‌మే. వాటిలో హింస త‌ప్ప హీరోయిజం స‌రిగా పండ‌లేదు.

క్లైమాక్స్ లో త‌డ‌బాటు...

ఫ‌స్ట్‌హాప్ హీరోహీరోయిన్ల ల‌వ్‌, రొమాన్స్‌తో సినిమా స‌ర‌దాగా సాగుతుంది. కొన్ని సీన్స్‌లో ఫ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇంట‌ర్వెల్ ముందు హీరో గ‌తం పేరుతో ట్విస్ట్ ఇచ్చి క‌థ‌ను రాయ‌ల‌సీమ వైపుకు ట‌ర్న్ చేశాడు డైరెక్ట‌ర్‌. హీరో, విల‌న్ పోరాటంతో సెకండాఫ్‌ను మొత్తం యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో నింపేశారు. ఆ సీన్స్ ఏవి లాజిక్‌ల‌తో సంబంధం లేకుండా సాగుతాయి. క్లైమాక్స్‌లో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపిస్తుంది. రొటీన్‌గా ఎండ్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది.

ల‌వ‌ర్‌బాయ్‌కి భిన్నంగా...

గ‌త సినిమాల్లో ల‌వ‌ర్‌బాయ్‌గా, ప‌క్కింటికుర్రాడి త‌ర‌హాలో సాఫ్ట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు వైష్ణ‌వ్‌తేజ్‌. ఆ పంథాకు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మ్యాస్ క్యారెక్ట‌ర్‌ను ఆదికేశ‌వ‌లో కనిపించాడు. డ్యూయ‌ల్‌షేడ్స్‌తో సాగే క్యారెక్ట‌ర్‌లో మెప్పించాడు. శ్రీలీల గ్లామ‌ర్‌,డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకుంది. రొటీన్ విల‌న్ పాత్ర‌కు త‌న యాక్టింగ్‌తో ప్రాణం పోశాడు జోజు జార్జ్‌. స‌దా, రాధిక శ‌ర‌త్‌కుమార్‌, సుమ‌న్ పాత్ర‌ల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌దు.

యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మాత్ర‌మే...

ఆదికేశ‌వం రొటీన్ అండ్ ఔట్‌డేటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. మాస్, యాక్ష‌న్ సినిమాల్ని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను ఈ సినిమా మెప్పించే అవ‌కాశం ఉంది.