Top gear Ott Update: ఓటీటీలోకి వచ్చేసిన ఆది సాయికుమార్ టాప్ గేర్ మూవీ.. ఎందులో అంటే?
Top gear Ott Update: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటించిన టాప్ గేర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గత డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది.
Top gear Ott Update: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఏడాది మూడు నుంచి నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ స్టార్. రీసెంట్‌గా ఆయన నటించిన పులి మేక అనే వెబ్‌సిరీస్‌కు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఆయన చేసిన క్రేజీ ఫెల్లో, సీఎస్ఐ సనాతన్, టాప్ గెర్ లాంటి చిత్రాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. క్రేజీ ఫెల్లో, సీఎస్ఐ సనాతన్ ఇప్పటికే ఓటీటీలో విడుదల కాగా.. తాజాగా టాప్ గేర్ చిత్రం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రెండింగ్ వార్తలు
రోడ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మూవీ ఆద్యంతం ఎంగేజింగ్‌గా, థ్రిల్‌ను కలిగిస్తుందని చూసినవారు అంటున్నారు. డైరెక్టర్ విజన్, టెక్నికాలిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన రియా సుమన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో సత్యం రాజేష్, శత్రు, బ్రహ్మాజీ, మైమ్ గోపీ, నర్రా శ్రీను, రవి ప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం గత డిసెంబరులో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
కథ..
ఈ స్టోరీ అర్జున్ అనే క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ ఆధ్యను ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుంటాడు. తమకున్నంతంలోనే హ్యాపీగా ఈ జంట లైఫ్ లీడ్ చేస్తుంటుంది. అయితే ఓ రోజు అర్జున్ క్యాబ్‌లో చిన్నపాటి డ్రగ్ డీలర్లయిన బ్రహ్మాజీ, రాజేష్ ఎక్కుతారు. భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయాలని వారిని గ్యాంగ్ స్టర్ సిద్ధార్థ్ ఒత్తిడి పెడతారు. పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి చర్య తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ గందరగోళంలో ఇరుక్కున్న అర్జున్.. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాడనేది మిగిలిన కథ.
టాప్ గేర్ సినిమాకు నూతన దర్శకుడు శశికాంత్ దర్శకత్వం వహించారు. శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అర్జున్ రెడ్డి ఫేమమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. పర్వీణ్ పూడి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఓటీటీ విజయవంతంగా ఈ టాప్ గేర్ చిత్రం విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.