Telugu News  /  Entertainment  /  Aadi Saikumar Starred Top Gear First Single Released
టాప్ గేర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
టాప్ గేర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల

Vennela Vennela Song from Top Gear: టాప్ గేర్ నుంచి తొలి పాట వచ్చేసింది.. సిద్ శ్రీరామ్ గళంలో అదిరే మెలోడీ

25 November 2022, 22:35 ISTMaragani Govardhan
25 November 2022, 22:35 IST

Vennela Vennela Song from Top Gear: ఆది సాయికుమార్ నటించిన టాప్ గేర్ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన వెన్నెల వెన్నెల సాంగ్ ఆకట్టుకుంటోంది.

Vennela Vennela Song from Top Gear: టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు చిత్రాల్లో సందడి చేసిన ఈ హీరో ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే టాప్ గేర్. ఈ సినిమాకు కే శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీ నుంచి ఫస్ట్ పాటను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

వెన్నెల వెన్నెల అంటూ సాగే ఈ పాటను శుక్రవారం సాయంత్రం టాప్ గేర్ టీమ్ విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. వినేందుకు వినసొంపుగా ఉన్న ఈ పాట అద్భుతంగా సాగింది. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. మెలోడీగా సాగే ఈ పాట యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. పాటలో సన్నివేశాలు కూడా.. మ్యూజిక్‌కు తగినట్లుగా ఉన్నాయి.

ఇప్పటికే టాప్ గేర్ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్ట్, గ్లింప్స్‌తో ప్రేక్షకులను మంచి హైప్ క్రియేట్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ మెలోడీ సాంగ్‌తో ఈ అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ ధనలక్ష్మీ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రియా సుమన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. కే శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్. మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్