Mystery Thriller Movie: ట్విస్ట్‌లతో సాగే తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఫ్రీగా చూసేయండి - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Mystery Thriller Movie: ఆది సాయికుమార్ హీరోగా నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సీఎస్ఐ సనతాన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్‌గా నటించగా...నందినిరాయ్, బిగ్‌బాస్ వాసంతి కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.
Mystery Thriller Movie: ఆది సాయికుమార్ హీరోగా నటించిన సీఎస్ఐ సనాతన్ మూవీ శుక్రవారం యూట్యూబ్‌లో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆది సాయికుమార్‌తో పాటు మిషా నారంగ్, అలీరెజా, నందినిరాయ్, బిగ్‌బాస్ వాసంతి కీలక పాత్రల్లో నటించారు. గత ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
మర్డర్ మిస్టరీ...
మర్డర్ మిస్టరీ కథాంశంతో దర్శకుడు శివ శంకర్ సీఎస్ఊ సనాతన్ సినిమాను రూపొందించాడు. సినిమా కాన్సెప్ట్‌తో పాటు ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో ఆదిసాయికుమార్ యాక్టింగ్ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి. సీఎస్ఐ సనాతన్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
థియేటర్లలో విడుదలైన ఏడాదిన్నర తర్వాత ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
సీఎస్ఐ సనాతన్ కథ ఇదే...
వీసీ గ్రూప్ అధినేత విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) తన ఆఫీస్‌లో జరిగిన పార్టీలోనే దారుణ హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ కేసు సాల్వ్ చేసే బాధ్యతను సనాతన్ చేపడుతాడు. విక్రమ్ పార్టనర్ దివ్యతో (నందినిరాయ్) పాటు ఆఫీస్ ఎంప్లాయ్స్ లాస్య (బిగ్‌బాస్ వాసంతి), సుదీక్షలకు (మిషా నారంగ్) ఈ హత్యకు సంబంధం ఉందని సనాతన్ అనుమానిస్తాడు.
ఈ కేసుకు మినిస్టర్ రాజవర్ధన్ కు లింక్ ఉందనే నిజం బయటపడుతుంది. వీరిలో అసలైన హంతకుడు ఎవరన్నది సనాతన్ ఎలా కనిపెట్టాడు. సుదీక్షను ప్రాణంగా ప్రేమించిన సనాతన్ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? విక్రమ్, దివ్య మధ్య ఉన్న సంబంధం ఏమిటి? విక్రమ్ చక్రవర్తి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు అతడిపై రివేంజ్ తీర్చుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేశారన్నది ఈ మూవీ కథ.
మైథలాజికల్ థ్రిల్లర్...
రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వచ్చిన ఆదిసాయికుమార్ కొన్నాళ్లుగా స్పీడు తగ్గించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నాడు. ఆదిసాయికుమార్ హీరోగా నటించిన షణ్ముఖ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.