Csi Sanatan OTT Streaming: ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన ఆది సాయికుమార్ సీఎస్ఐ స‌న‌తాన్-aadi sai kumar csi sanatan streaming now on amazon prime video and aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aadi Sai Kumar Csi Sanatan Streaming Now On Amazon Prime Video And Aha Ott

Csi Sanatan OTT Streaming: ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైన ఆది సాయికుమార్ సీఎస్ఐ స‌న‌తాన్

Nelki Naresh Kumar HT Telugu
May 10, 2023 01:28 PM IST

Csi Sanatan OTT Streaming: ఆది సాయికుమార్ హీరోగా న‌టించిన సీఎస్ ఐ స‌న‌తాన్ మూవీ బుధ‌వారం రోజు రెండు ఓటీటీల‌లో రిలీజైంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏవంటే...

సీఎస్ ఐ స‌న‌తాన్ మూవీ
సీఎస్ ఐ స‌న‌తాన్ మూవీ

Csi Sanatan OTT Streaming: స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తోన్నాడు ఆది సాయికుమార్‌. అత‌డు హీరోగా న‌టించిన సీఎస్ఐ స‌న‌తాన్ మూవీ మార్చి 10న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ బుధ‌వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. రెండు ఓటీటీలోనూ ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉన్న‌ట్లు నిర్మాత‌లు చెబుతోన్నారు. సీఎస్ఐ స‌న‌తాన్ లో క్రైమ్ సీన్ ఇన్వేస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా ఆది సాయికుమార్ న‌టించాడు. ఓ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ మ‌ర్డ‌ర్ కేసును స‌న‌తాన్ ఎలా సాల్వ్ చేశాడు? అసలైన హంత‌కుడిని త‌న తెలివితేట‌ల‌తో ఏ విధంగా ప‌ట్టుకున్నాడ‌నే పాయింట్‌కు స‌స్పెన్స్‌, ల‌వ్‌తో అంశాల‌ను జోడిస్తూ ద‌ర్శ‌కుడు శివ‌శంక‌ర్ దేవ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

సీఎస్ఐ స‌న‌తాన్ తోనే ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శివ‌శంక‌ర్ దేవ్ . ఇందులో ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్‌గా న‌టించింది. నందినిరాయ్, ఖ‌య్యుం, ర‌విప్ర‌కాష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. గ‌త ఏడాది ఆది సాయికుమార్ న‌టించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది సీఎస్ ఐ స‌న‌తాన్ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అత‌డు త్వ‌ర‌లోనే మ‌రో మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

ప్ర‌స్తుతం జంగిల్‌, కిరాత‌క‌తో పాటు అమ‌ర‌న్ ఇన్ ది సిటీ సినిమాల్లో హీరోగా న‌టిస్తోన్నాడు ఆది సాయికుమార్ . అలాగే పులిమేక వెబ్‌సిరీస్‌తో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఆది సాయికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవ‌ల జీ5 ఓటీటీలో ఈ సిరీస్ రిలీజైంది.

IPL_Entry_Point