Aa Okkati Adakku OTT Streaming: ఆ ఒక్కటి అడక్కు ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడాలంటే?
Aa Okkati Adakku OTT Streaming: ఆ ఒక్కటి అడక్కు మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి రావడం విశేషం.
Aa Okkati Adakku OTT Streaming: అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ సినిమా శుక్రవారం (మే 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనను అటు మేకర్స్ గానీ, ఇటు సదరు ఓటీటీగానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
ఓటీటీలోకి ఆ ఒక్కటి అడక్కు
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా నటించిన మూవీ ఆ ఒక్కటి అడక్కు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా కావడం విశేషం. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కు మల్లి అంకం దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మిక్స్‌డ్ రియాక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది.
ఈ సినిమాకు సంబంధించిన ముందుస్తుగా ఎలాంటి సమాచారం లేదు. మే 31న రావచ్చన్న అంచనాలు మాత్రమే ఉన్నాయి. ఊహించినట్లే సడెన్ గా ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ను ఈ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేసేయండి.
ఆ ఒక్కటి అడక్కు స్టోరీ ఏంటంటే?
గణపతి (అల్లరి నరేష్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. 30 ఏళ్లు దాటినా పెళ్లికాదు. అతడికి వచ్చిన పెళ్లి సంబంధాలన్ని రిజెక్ట్ అవుతుంటాయి. ఓ సమస్య కారణంగా సిద్ధిని (ఫరియా అబ్దుల్లా) తన ప్రియురాలిగా కుటుంబసభ్యులకు పరిచయం చేస్తాడు గణపతి. మ్యాట్రిమెనీ పేరుతో అబ్బాయిలకు వలవేస్తూ మోసాలకు పాల్పడుతుందంటూ సిద్ధి గురించి పేపర్లలో న్యూస్ వస్తుంది?
సిద్ధి గురించి వచ్చిన ఆ వార్త నిజమేనా? ఆ సమస్య నుంచి ఆమెను గణపతి ఎలా గట్టెక్కించాడు? గణపతి పెళ్లి ప్రపోజల్‌ను మొదల తిరస్కరించిన సిద్ధి ఆ తర్వాత అతడితో ఎలా ప్రేమలో పడిందన్నదే ఈ మూవీ కథ. పెళ్లి వయసు దాటినా సంబంధాలు కుదరక అబ్బాయిలు పడే ప్రస్టేషన్‌ను దర్శకుడు ఈ మూవీలో వినోదాత్మకంగా చూపించాడు. అయితే అదే స్థాయిలో సినిమా కామెడీ మొత్తం వర్కవుట్ కాలేదు.
ఆ ఒక్కటి అడక్కు కలెక్షన్స్
మిక్సడ్ టాక్‌తో సంబంధం లేకుండా ఆ ఒక్కటి అడక్కు మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఏడు రోజుల్లో ఈ మూవీ 5.95 గ్రాస్ కలెక్షన్స్, 2.70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. నాలుగున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేకపోయింది.
ప్రస్తుతం అల్లరి నరేష్ బచ్చలమల్లి పేరుతో ఓ ప్రయోగాత్మక మూవీ చేస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి.