90s Classic Telugu Movies on OTTs: 1990ల్లో వచ్చిన క్లాసిక్ తెలుగు సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?-90s classic telugu movies on otts chiranjeevi nagarjuna venkatesh balakrishna pawan kalyan movies in prime video youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  90s Classic Telugu Movies On Otts: 1990ల్లో వచ్చిన క్లాసిక్ తెలుగు సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?

90s Classic Telugu Movies on OTTs: 1990ల్లో వచ్చిన క్లాసిక్ తెలుగు సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Apr 17, 2024 03:54 PM IST

90s Classic Telugu Movies on OTTs: 1990ల్లో వచ్చిన తెలుగు సినిమాలకు ఇప్పటికీ, ఎప్పటికీ అభిమానులు ఉంటారు. మరి అప్పట్లో వచ్చిన క్లాసిక్ సినిమాలు ఏవి? ప్రస్తుతం వాటిని ఏ ఓటీటీల్లో చూడొచ్చో ఇక్కడ చూడండి.

1990ల్లో వచ్చిన క్లాసిక్ తెలుగు సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?
1990ల్లో వచ్చిన క్లాసిక్ తెలుగు సినిమాలు.. ఏ ఓటీటీల్లో చూడాలంటే?

90s Classic Telugu Movies on OTTs: తెలుగు సినిమాకు 1990వ దశకం ప్రత్యేకమని చెప్పొచ్చు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంతోపాటు వెంకటేశ్, నాగార్జున, పవన్ కల్యాణ్, బాలకృష్ణలాంటి వాళ్లు పెద్ద హీరోలుగా ఎదిగిన దశకమది. అంతేకాదు తెలుగు సినిమా గర్వంగా చెప్పుకోదగిన ఎన్నో గొప్ప సినిమాలు కూడా అప్పట్లో వచ్చాయి. మరి వాటి కొన్ని క్లాసిక్ సినిమాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం.

జగదేక వీరుడు అతిలోక సుందరి - సన్ నెక్ట్స్, యూట్యూబ్

చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైమ్ సూపర్ డూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ తోపాటు సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.

గ్యాంగ్‌లీడర్ - ప్రైమ్ వీడియో, జియో సినిమా

చిరంజీవి కెరీర్లో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఒకటి ఈ గ్యాంగ్‌లీడర్. 1991లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. అందులోని పాటలు ఊపేశాయి. చిరు స్టెప్పులు, ఫైట్లు మరో రేంజ్. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియో, జియో సినిమాతోపాటు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంది.

సీతారామయ్యగారి మనవరాలు - ప్రైమ్ వీడియో, ఆహా

1990ల్లో వచ్చిన క్లాసిక్ మూవీస్ లో ఈ సీతారామయ్యగారి మనవరాలు కూడా ఒకటి. ఏఎన్నార్, మీనా పోటీ పడి నటించిన ఈ సినిమాను ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో చూడొచ్చు.

చంటి - జీ5, యూట్యూబ్

వెంకటేశ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన సినిమా చంటి. 1991లో వచ్చిన ఈ మూవీలో మీనా కూడా నటించింది. ఈ సినిమాను జీ5, యూట్యూబ్ లలో చూడొచ్చు.

క్షణక్షణం - ప్రైమ్ వీడియో

వెంకటేశ్, శ్రీదేవి, రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ క్షణక్షణం. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

పెళ్లి పుస్తకం - ప్రైమ్ వీడియో

రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి నటించిన ఈ సినిమాను బాపు డైరెక్ట్ చేశాడు. ఇదో క్లాసిక్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఆదిత్య 369 - ప్రైమ్ వీడియో

బాలకృష్ణ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమాను కొత్త పంథాలో నడిపిన మూవీ ఆదిత్య 369. సింగీతం శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రైమ్ వీడియోతోపాటు ఈటీవీ విన్ లో ఉంది.

హలో బ్రదర్ - హాట్‌స్టార్, యూట్యూబ్

నాగార్జునకు పెద్ద హిట్ అందించిన మూవీ హలో బ్రదర్. అతడు డ్యుయల్ రోల్లో నటించిన ఈ సినిమా హాట్‌స్టార్, యూట్యూబ్ లో చూడొచ్చు.

పెదరాయుడు - సన్ నెక్ట్స్, యూట్యూబ్

మోహన్ బాబు, రజనీకాంత్ నటించిన పెదరాయుడు మూవీ 1990ల్లో పెద్ద హిట్. టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్, యూట్యూబ్ లలో అందుబాటులో ఉంది.

నిన్నే పెళ్లాడతా - హాట్‌స్టార్, యూట్యూబ్

నాగార్జున, టబు నటించిన ఈ సినిమా 1996లో యువత మనసును దోచింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హాట్‌స్టార్, యూట్యూబ్ లలో చూడొచ్చు.

పెళ్లి సందడి - యూట్యూబ్

శ్రీకాంత్ నటించిన ఈ సినిమాను రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశాడు. అతని కెరీర్లో అతి పెద్ద హిట్ ఈ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

తొలిప్రేమ - యూట్యూబ్, హాట్‌స్టార్

పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి అతి పెద్ద హిట్ మూవీ తొలి ప్రేమ. అప్పటి లవ్ స్టోరీలకు ఓ బెంచ్ మార్క్ మూవీ. ఈ తొలిప్రేమ మూవీని యూట్యూబ్ తోపాటు హాట్‌స్టార్ ఓటీటీల్లో చూడొచ్చు.

Whats_app_banner