Pushpa 2 Controvers: పుష్ప 2 బీజీఎం క్రెడిట్ వివాదం.. డీఎస్పీని ఇరుకున పెట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్-90 per cent of pushpa 2 background music is mine music composer sam cs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2 Controvers: పుష్ప 2 బీజీఎం క్రెడిట్ వివాదం.. డీఎస్పీని ఇరుకున పెట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్

Pushpa 2 Controvers: పుష్ప 2 బీజీఎం క్రెడిట్ వివాదం.. డీఎస్పీని ఇరుకున పెట్టిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ సీఎస్

Galeti Rajendra HT Telugu
Dec 06, 2024 02:32 PM IST

Pushpa 2 background music: పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రీ క్లైమాక్స్‌లో అల్లు అర్జున్ నటనకి బీజీఎం మరింత బలం చేకూర్చిందని కితాబులు వస్తున్నాయి. దాంతో.. ?

 పుష్ప 2 బీజీఎంపై వివాదం
పుష్ప 2 బీజీఎంపై వివాదం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అల్లు అర్జున్ నటనకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలం చేకూర్చిందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. దాంతో.. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? అనే చర్చ మొదలైంది. దానికి కారణం.. పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, శ్యామ్‌ సీఎస్ ఇద్దరూ పనిచేయడమే. ఇద్దరూ ఆ క్రెడిట్ కోసం పోటీపడుతూ మాట్లాడుతున్నారు.

yearly horoscope entry point

నైతిక విలువలు లేవట

పుష్ప 2 రిలీజ్ ముంగిట దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని చాలా మంది ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లలో నైతిక విలువలు కనిపించడం లేదని చెప్పుకొచ్చాడు. అలానే ఏ వ్యక్తి క్రెడిట్‌ను నేను తీసుకోలేను అని స్పష్టం చేశాడు. ఈ ఇంటర్వ్యూ గురువారం వైరల్‌ అవగా.. పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్‌ సీఎస్ కూడా స్పందించాడు.

90 శాతం నేనే ఇచ్చా

‘‘పుష్ప 2కి పనిచేసే మందు నేను స్క్రిప్ట్ చదవలేదు. అప్పటికే దాదాపు ఎడిటింగ్ వర్క్ చివరి దశలో ఉంది. మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు 90 శాతం నేనే ఇచ్చాను. ప్రేక్షకులకి కొత్త ఎక్స్‌ఫీరియన్స్ ఇవ్వడానికి పైపు పరికరాలు.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయం కూడా తీసుకున్నా. ఇది ప్రేక్షకులకి ఫ్రెష్ సౌండ్ విన్న ఫీలింగ్ ఇస్తోంది. ఇప్పుడు ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని శ్యామ్‌ సీఎస్ చెప్పుకొచ్చారు.

క్రిడెట్ ఇవ్వరు.. తీసుకోవాలన్న డీఎస్పీ

పుష్ప 2 మ్యూజిక్ వివాదంపై సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా బహిరంగంగానే దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన విషయం తెలిసిందే. స్క్రీన్‌పై క్రెడిట్ అయినా.. పేమెంట్ అయినా ఎవ్వరూ ఇవ్వరని.. మనమే తీసుకోవాల్సిందేనని చెప్పుకొచ్చాడు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు.. టైమ్‌కి ప్రోగ్రామ్‌కి రాలేదనే ఫిర్యాదులు నాపై వస్తున్నాయని.. ప్రేమ ఉన్నప్పుడే ఇలాంటివి వస్తుంటాయని దేవిశ్రీ ప్రసాద్ కవర్ చేసుకున్నాడు. కానీ.. ఇప్పుడు పుష్ప 2 మ్యూజిక్ క్రిడెట్ వివాదం తెరపైకి రావడంతో.. మళ్లీ దేవిశ్రీ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Whats_app_banner