Game Changer Songs : గేమ్ ఛేంజర్ సాంగ్స్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
Game Changer Songs : ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత.. గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఇక ఆయన తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో పాటల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయి దాటి వెళ్లాడు రామ్ చరణ్(Ram Charan). జపాన్ లాంటి దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత సినిమా శంకర్ దర్శకత్వంలో(Director Shankar) వస్తుండటంతో మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఉత్తమ కమర్షియల్ దర్శకులలో ఒకరిగా చూసే.. శంకర్‌తో గేమ్ ఛేంజర్(Game Changer) చిత్రం అనేసరికి.. సూపర్ హిట్ కచ్చితం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. శంకర్.. గేమ్ ఛేంజర్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశాడు.
గేమ్ ఛేంజర్ పాటలకే(Game Changer Songs) దాదాపు 90 కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. దర్శకుడు శంకర్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా గ్రాండియర్‌కు ఉంటాయి. ఆయన చిత్రాలలో దాదాపు అన్ని పాటలు ఎన్ని రోజులైనా చూడాలి, వినాలి అనిపిస్తుంది. ఇప్పుడు చరణ్ నటించిన సినిమాకి కూడా దర్శకుడు అదే రిపీట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ తమన్(Thaman) గేమ్ ఛేంజర్ ఆల్బమ్ అత్యంత క్వాలిటీతో ఉంటుందని కొన్ని ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. 90 కోట్లు పాటలకే ఖర్చు పెడుతున్నారంటే.. ఈ విషయం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. శంకర్-రామ్ చరణ్ సినిమా కావడంతో పాటలతో పాటు, సినిమా కంటెంట్‌ను ఎలా ఉంటుందో చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, దిల్ రాజు(Dil Raju) ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు.
పొలిటికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియన్ లెవెల్‌లో గేమ్‌ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, సునీల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. గేమ్ ఛేంజర్ మూవీ కోసం హిట్, హిట్ -2 మూవీస్ డైరెక్టర్ శైలేష్ కొలను రంగంలోకి దిగాడట. ఈ సినిమాలోని కొన్నీ సీన్స్‌కు శంకర్ స్థానంలో అతడు దర్శకత్వం వహిస్తున్నాడని టాక్ ఉంది. గేమ్ ఛేంజర్ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా శైలేష్ కొలను వ్యవహరిస్తున్నాడు. శంకర్ మార్గదర్శకత్వంలో రఘుబాబు, రాకెట్ రాఘవతో పాటు మరికొంత మంది నటీనటులపై వచ్చే కామెడీ సీన్స్‌ను శైలేష్ కొలను తెరకెక్కించనున్నట్టుగా టాక్ ఉంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.