777 Charlie TV Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తున్న 777 ఛార్లీ.. ఎప్పుడు? ఎందులో?-777 charlie tv premier date announed by zee telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  777 Charlie Tv Premier Date Announed By Zee Telugu

777 Charlie TV Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తున్న 777 ఛార్లీ.. ఎప్పుడు? ఎందులో?

Hari Prasad S HT Telugu
Jun 06, 2023 03:43 PM IST

777 Charlie TV Premier Date: హమ్మయ్య.. రిలీజైన ఏడాది తర్వాత టీవీలోకి వచ్చేస్తోంది 777 ఛార్లీ మూవీ. గతేడాది సంచలనాలు క్రియేట్ చేసిన ఈ కన్నడ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ ను జీ తెలుగు అనౌన్స్ చేసింది.

777 ఛార్లీలో రక్షిత్ శెట్టి
777 ఛార్లీలో రక్షిత్ శెట్టి (twitter)

777 Charlie TV Premier Date: వచ్చే సండే జీ తెలుగు ప్రేక్షకులకు పండగే. ఆ ఛానెల్ రెండు గుడ్‌న్యూస్ లను ప్రేక్షకులకు అందించింది. గతేడాది రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేసిన 777 ఛార్లీ మూవీ.. మొత్తానికి టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ సినిమా జీ తెలుగులో రానుంది. వచ్చే ఆదివారం (జూన్ 11) సాయంత్రం 5.30 గంటలకు 777 ఛార్లీ మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది.

అంతేకాదు ఈ మూవీ పూర్తయిన వెంటనే అంటే అదే రోజు రాత్రి 9 గంటలకు డ్రామా జూనియర్స్ సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 6) జీ తెలుగు ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఎంతో మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 777 ఛార్లీ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మొత్తానికి మరో నాలుగు రోజుల్లో రానుంది.

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఒంటరి జీవితంలో గడుపుతున్న ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన కుక్క.. అతని లైఫ్ ను ఎలా మారుస్తుందన్నది ఈ 777 ఛార్లీ కథాంశం. ఆ కుక్కతో ఆ యువకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాడు. మళ్లీ జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఘటన ఎదురవుతుంది?

ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ 777 ఛార్లీ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యే రిలీజై ఏడాది పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మొత్తానికి టీవీ ప్రేక్షకులను అలరించబోతోంది. గతేడాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కన్నడ సినిమాల్లో ఇదీ ఒకటి. సైలెంట్ గా వచ్చి సంచలన విజయం సాధించింది.

నిజానికి చాన్నాళ్ల కిందటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చినా.. దీనిని ఫ్రీగా కాకుండా రూ.129 చెల్లించి చూడాలని నిబంధన విధించింది. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి రాలేదు. కన్నడ వెర్షన్ మాత్రం వూట్ సెలక్ట్ లో ఉచితంగా చూడొచ్చు.

IPL_Entry_Point

సంబంధిత కథనం