టీవీ సీరియల్స్‌లో కొన్నాళ్లుగా స్టార్ మా ఛానల్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. ఒకప్పుడు ఈటీవీ సీరియల్స్ టాప్‌లో ఉండేవి. స్టార్ మాతో పాటు జీ తెలుగు దెబ్బకు ఈటీవీ సీరియల్స్ టీఆర్‌పీలో దారుణంగా వెనుకబడిపోయాయి. స్టార్‌మా, జీ తెలుగుకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఈటీవీ రెడీ అవుతోంది.
ఒకేరోజు ఏడు సీరియల్స్‌ను మొదలుపెట్టబోతుంది. ఈ సీరియల్స్ టైటిల్స్, యాక్టర్స్‌తో పాటు టెలికాస్ట్ టైమింగ్స్‌ను ఈటీవీ రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. మే 26 నుంచి ఈ సీరియల్స్ టెలికాస్ట్ కాబోతున్నట్లు ప్రకటించింది.
ఈ ఏడు సీరియల్స్ మధ్యాహ్నం స్లాట్‌లోనే టెలికాస్ట్ కాబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఈ సీరియల్స్‌ను చూడొచ్చని ఈటీవీ ప్రకటించింది. ఈ ఏడు సీరియల్స్‌కు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించి బుల్లితెర ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. టైమ్ అయిపోతుంది ఇంకా ఎవరూ రెడీ కాలేదు అంటూ ప్రోమోలోకి ట్రెడిషనల్‌గా కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ కుటుంబంలో ఒక్కొక్కరిది ఒక్కో కథ...అందరిని ఒక్క దగ్గరకు తీసుకురావడమే పెద్ద విషయం అని ఒక్కో సీరియల్‌లోని క్యారెక్టర్స్‌ను కీర్తి సురేష్ పరిచయం చేసింది. ఒక్కో సీరియల్ టైటిల్‌ను క్యారెక్టర్స్‌తో మాట్లాడుతూ వెరైటీగా రివీల్ చేసింది.
శుభాకాంక్షలు సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. ఇందులో పల్లవికి పెళ్లి కుదురుతుంది. కానీ అదే టైమ్‌లో పల్లవి తల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనే కథతో ఈ సీరియల్ తెరకెక్కబోతున్నట్లు ప్రోమోలో చూపించారు. యమున ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆరో ప్రాణం సీరియల్ మధ్యాహ్నం 12 .20 నుంచి టెలికాస్ట్ కానున్నట్లు ప్రకటించారు.
అవంతిక మున్నీ శివరాజ్, వేణుగోపాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంధ్యారాగం సీరియల్ మధ్యాహ్నం 12.40 నుంచి ఒంటిగంట వరకు చూడొచ్చని ప్రకటించింది. ఈ మూడు సీరియల్స్ టెలికాస్ట్ టైమ్ ప్రతిరోజు కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే ఉండబోతున్నట్లు వెల్లడించింది.
ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ కానున్నట్లు ప్రోమోలో చూపించారు. ఇందులో బాధ్యతలేని భర్త, స్వార్థపరుడైన కొడుకు మధ్య ధరణి అనే గృహిణి ఎలా నగిలిపోయిందో అన్నదే జీవన తరంగాలు కథ అని ప్రోమోలో రివీల్ చేశారు.
వసుంధర ఓ కలెక్టర్. కానీ అత్త మాత్రం ఆమెను ద్వేషిస్తుంనే ఉంటుంది. అత్త మనసును ఆ కలెక్టర్ ఎలా గెలుచుకుంది అనే కథతో వసుంధర సీరియల్ ప్రసారం కాబోతోంది. మధ్యాహ్నం 1.30 నుంచి రెండు గంటలుగా ఈ సీరియల్ టైమింగ్ ఉండబోతున్నట్లు ఈ టీవీ ప్రకటించింది.
రెండు గంటలు మెరుపు కలలు, రెండున్నర గంటలకు వేయి శుభములు కలుగు నీకు సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయని ప్రోమో ద్వారా ప్రకటించారు. ప్రోమో చివరలో ఈ సీరియల్స్ యాక్టర్స్‌తో కలిసి కీర్తి సురేష్ కనిపించింది. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం