69th National Film Awards: జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్ర సృష్టించిన బన్నీ.. ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డుల పంట
69th National Film Awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ విభాగాల్లో పురస్కారాల విజేతలను జ్యూరీ సభ్యులు వెల్లడించారు. ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు అల్లు అర్జున్.
69th National Film Awards: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు దక్కించుకున్న తొలి యాక్టర్ గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా జాతీయ అవార్డుల పంట పండింది. భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ మీడియా సెంటర్లో నేడు (ఆగస్టు 24).. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి జాతీయ అవార్డుల విజేతలను నేడు వెల్లడించారు. తెలుగు సినిమాలు ఆర్ఆర్ఆర్, పుష్ప: ది రైజ్ ఈసారి జాతీయ అవార్డుల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డుల పంట పండింది. పుష్ప ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్‍కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. మొత్తంగా తెలుగుకు పది అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం పురస్కారం ‘రాకెట్రీ నంబీ ఎఫెక్ట్’కు దక్కింది. అవార్డుల వివరాలివే..
2021కు గాను జాతీయ అవార్డులు ఇవే..
జాతీయ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్)
ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్ అందించిన పాపులర్ సినిమా: ఆర్ఆర్ఆర్
జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) - దేవీ శ్రీప్రసాద్ (పుష్ప: ది రైజ్)
జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) - ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)
జాతీయ ఉత్తమ గాయకుడు - కాలభైరవ (ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో పాట)
జాతీయ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ - యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ - కింగ్ సోలోమాన్ (ఆర్ఆర్ఆర్)
జాతీయ ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వీ శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)
జాతీయ ఉత్తమ పాట రచయిత - చంద్రబోస్ (కొండపొలం - ధమ్ దమాధమ్)
జాతీయ ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్
జాతీయ ఉత్తమ డైరెక్టర్ - నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ)
జాతీయ ఉత్తమ నటీమణులు - అలియా భట్ (గంగూభాయ్ కఠియవాడి), కృతిసనన్ (మిమి)
ఉత్తమ తెలుగు సినిమా - ఉప్పెన
జాతీయ సమైక్యత గురించి ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్
స్పెషల్ జ్యూరీ అవార్డ్ - విష్ణువర్ధన్ (షేర్ షా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - దిమిత్రీ మలిచ్, ధృవ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్)
బెస్ట్ ఎడిటింగ్ - సంజయ్ లీలా భన్సాలీ (గంగూభాయ్ కఠియవాడి)
ఉత్తమ జాతీ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) - షాహీ కబీర్ ( నయట్టు- మలయాళం)
బెస్ట్ అడాప్టివ్ స్క్రీన్ ప్లే: సంజయ్ లీలా బన్సాలీ, ఉత్తర్షిని (గంగూభాయ్ కఠియవాడి)
బెస్ట్ డైలాగ్ రైటర్ - గంగూభాయ్ కఠియవాడి
బెస్ట్ సినిమాటోగ్రఫీ - అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్)
ఉత్తమ ఫీమేల్ ప్లే బ్యాక్ సింగర్ - శ్రేయా ఘోషాల్ (ఇరవిన్ నిజాల్.. మాయావా చయావా)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ - భవిన్ రబారీ (చెల్లో షో)
జాతీయ ఉత్తమ సపోర్టింగ్ నటి - పల్లవి జోషీ (కశ్మీర్ ఫైల్స్)
జాతీయ ఉత్తమ సపోర్టింగ్ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి)
ఆర్ఆర్ఆర్ సినిమా 2022 మార్చిలో విడుదలైనా.. 2021 డిసెంబర్లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. అందుకే ఈ చిత్రాన్ని 2021 సినిమాగానే అవార్డులకు పరిగణనలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.