ఇటుక.. ఇటుక పేర్చి కోట కట్టేసిన నాని.. సక్సెస్‍కు 5 కారణాలు ఇవే.. నేచురల్ స్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!-5 reasons for hero nani massive success in tollywood and his net worth and other details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇటుక.. ఇటుక పేర్చి కోట కట్టేసిన నాని.. సక్సెస్‍కు 5 కారణాలు ఇవే.. నేచురల్ స్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

ఇటుక.. ఇటుక పేర్చి కోట కట్టేసిన నాని.. సక్సెస్‍కు 5 కారణాలు ఇవే.. నేచురల్ స్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!

టాలీవుడ్‍లో వరుస విజయాలతో దూసుకెళుతున్నారు నాని. సూపర్ ఫామ్‍లో ఉన్నారు. బ్లాక్‍బస్టర్లతో దుమ్మురేపుతూ స్టార్ ఇమేజ్‍ను మరింత పెంచేసుకున్నారు. టాలీవుడ్‍లో ఇంత బలంగా నాని ఎదిగేందుకు ముఖ్యమైన కారణాలు ఏవంటే..

నాని సక్సెస్‍కు 5 కారణాలు ఇవే

ఎలాంటి సినిమా బ్యాక్‍గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. కెరీర్‌ను ఒక ప్లానింగ్, ఒక పద్ధతితో బలపరుచకున్నారు. సినిమాలతో ఇటుక ఇటుక పేర్చి టాలీవుడ్‍లో ఏకంగా తనకంటూ ప్రత్యేక కోట కట్టేసుకున్నారు. చాలా మంది కొత్త టాలెంటెడ్ దర్శకులను, టెక్నిషియన్లను వెలుగులోకి తెచ్చారు. మూడు.. వంద కోట్ల సినిమాతో దాదాపు టైప్-1 హీరోల జాబితాలోకి నేచులర్ స్టార్ అడుగుపెట్టేశారు. ఇటీవలే హిట్ 3తో మరో బ్లాక్‍బస్టర్ కొట్టారు. నవీన్ బాబు నుంచి నేచురల్ స్టార్ నాని వరకు ఎదిగేందుకు ప్రధానమైన కారణాలు ఏవంటే..

జనాలకు కనెక్ట్ అయ్యారు

నేచురల్ స్టార్ నాని.. తెలుగు ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యారు. కెరీర్ ఆరంభంలో ఆయన అలాంటి చిత్రాలే చేశారు. 2008లో అష్టాచెమ్మ మూవీతో నాని తెరంగేట్రం చేశారు. ఆ చిత్రమే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆయనకు గుర్తింపు వచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమిందార్, నేను లోకల్, ఎంసీఏ, జెర్సీ సహా మరిన్ని చిత్రాలతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. పక్కింటి అబ్బాయి అనే ఫీలింగ్ తీసుకొచ్చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‍కు కూడా కనెక్ట్ అయ్యారు. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. రాజమౌళితో చేసిన ఈగ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

దసరా మూవీతో మాస్ టర్న్ తీసుకున్నారు నాని. సరిపోదా శనివారం, హిట్ 3 చిత్రాలు కూడా యాక్షన్‍ సినిమాలుగా వచ్చాయి. తదుపరి ది ప్యారడైజ్ కూడా వైలెంట్‍గానే ఉండనుంది. దీంతో మాస్ ఇమేజ్‍ను కూడా పెంచుకునేందుకు అడుగులు వేస్తున్నారు నాని. ఇది కూడా సక్సెస్ అవుతోంది. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 మూడు రూ.100కోట్లు మార్క్ దాటాయి. మధ్యలో హాయ్ నాన్న కూడా సూపర్ హిట్టే. ప్యారడైజ్‍పై అంచనాలు నెక్స్ట్ రేంజ్‍లో ఉన్నాయి.

ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటన

నాని ఓ అద్భుతమైన నటుడు. ఏ పాత్రలోనా ఒదిగిపోయి యాక్టింగ్‍తో మెప్పించేస్తారు. నేను లోకల్, ఎంసీఏ లాంటి సినిమాల్లో హుషారైనా కుర్రాడి పాత్ర అయినా.. భలే భలే మగాడివోయ్ మూవీలో కామెడీతోనైనా.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో గంభీరమైన క్యారెక్టరైనా.. జెర్సీలో ఎమోషనల్‍గానైనా.. సరిపోదా శనివారం, హిట్ 3లో వైలెంట్‍గానైనా.. ఇలా ఏది చేసిన పూర్తిగా న్యాయం చేస్తారు నాని. ప్రేక్షకులు ఆ స్థాయిలో నాని ఇష్టపడేందుకు, అభిమానించేందుకు ఆయన యాక్టింగ్ స్కిల్స్ ముఖ్యమైన కారణంగా ఉన్నాయి.

ప్లానింగ్.. నిలకడ

సినిమాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి నవీన్ బాబుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నాని. ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అష్టా చెమ్మతో హీరో నాని అయ్యారు. కెరీర్ మొదటి నుంచి ఓ ప్లానింగ్‍తోనే సినిమాలు చేశారు. మెజార్టీ ప్రేక్షకులకు నచ్చే సినిమాలు ముందు చేశారు. ఎక్కువగా ప్రయోగాల జోలికి ఎక్కువగా పోలేదు. కమర్షియల్ చిత్రాలు చేశారు. నిలకడగా హిట్స్ కొట్టారు. అయితే, కెరీర్లో మంచి దశకు వచ్చిన తర్వాతి నుంచి కొత్త రకం కథలు ఎంపిక చేసుకుంటున్నారు నాని. అందులోనూ సక్సెస్ అయ్యారు. నాని సినిమా అంటే ఏదో ఓ కొత్తదనం ఉంటుందని అనుకునే రేంజ్‍కు వచ్చారు. ఇలా ఓ పద్ధతి ప్రకార ప్లాన్ చేసుకొని కెరీర్ నిర్మించుకున్నారు నేచురల్ స్టార్.

స్క్రిప్ట్ సెలెక్షన్

స్కిప్ట్ సెలెక్షన్‍లో నాని ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటారు. కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్న కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ క్రమంలోనే భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్, జెర్సీ సహా మరిన్ని చిత్రాలు నాని కెరీర్లో ప్రత్యేకంగా నిలిచాయి.

సినిమాపై ప్యాషన్

నానికి సినిమాపై మొదటి నుంచి ప్యాషన్ ఎక్కువ. ఆయన యాక్టింగ్, సినిమాలు, మాటల్లోనూ ఇది ఎప్పుడూ స్పష్టమవుతుంటుంది. ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలని ఎప్పుడూ తపన పడుతుంటారు నేచులర్ స్టార్. అందుకే చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ప్యాషన్‍తోనే వాల్ పోస్టర్ సినిమాస్ పేరుతో బ్యానర్ స్థాపించారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను సహా మరికొందరు డైరెక్టర్లను పరిచయం చేశారు. చాలా మంది కొత్త దర్శకులకు ఛాన్సులు ఇచ్చారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు నాని. కెరీర్ మొదటి నుంచి సినిమాలతో ఒక్కో ఇటుక పేర్చుకుంటూ బలమైన కోట కట్టుకున్నారు.

నాని ఆస్తుల విలువ ఇదే!

నాని ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు రూ.152 కోట్లుగా ఉందనే అంచనాలు ఉన్నాయి. సినిమాలతో పాటు చాలా బ్రాండ్‍లకు ప్రచారకర్తగా నాని ఉన్నారు. నిర్మాతగానూ ఆయన చేసిన చిత్రాలు సక్సెస్ అయ్యాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం