ఈవారం వివిధ ఓటీటీల్లో తమిళ చిత్రాలు క్యూకట్టేస్తున్నాయి. ఓటీటీలో తమిళ సినిమాలు చూడాలనుకునే వారికి మంచి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఒకే రోజు ఐదు చిత్రాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బ్లాక్‍బస్టర్ డ్రాగన్ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. నీక్ కూడా అడుగుపెట్టనుంది. మరో మూడు చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఈవారంలో ఒకే రోజు (మార్చి 21) ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ఐదు తమిళ చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ చిత్రం రేపు (మార్చి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లతో థియేటర్లలో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఫిబ్రవరి 21 థియేటర్లలో రిలీజైన డ్రాగన్ (తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్) సరిగ్గా నెలకు మార్చి 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తోంది. అశ్విన్ మరిమత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (నీక్) సినిమా కూడా రేపే మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తెలుగు వెర్షన్ జాబిలమ్మ ఇంత కోపమా కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురైంది. ఈ నీక్ మూవీలో పవీశ్ నారాయణన్ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో రేపటి నుంచి చూడొచ్చు.
తమిళ కామెడీ డ్రామా చిత్రం బేబీ అండ్ బేబీ రేపు మార్చి 21వ తేదీన సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జై, సత్యరాజ్, యోగిబాబు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్ల విడుదలైంది. ఈ మూవీకి ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఇద్దరు పిల్లలు మారిపోవడం చుట్టూ బేబీ అండ్ బేబీ చిత్రం సాగుతుంది.
రింగ్ రింగ్ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. ఈ చిత్రం రేపు మార్చి 21న ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. టెంట్‍కొట్ట ఓటీటీలోనూ అందుబాటులోకి రానుంది. ప్రవీణ్ రాజ్, వివేక్ ప్రసన్న లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రానికి శక్తివేల్ దర్శకత్వం వహించారు. రింగ్ రింగ్ మూవీని రేపటి నుంచి ఆహా తమిళ్, టెంట్‍కొట్టల్లో చూడొచ్చు.
దినసరి చిత్రం రేపు (మార్చి 21) టెంట్‍కొట్ట ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రంలో శ్రీరామ్, సింథియా హీరోహీరోయిన్లుగా నటించారు. జి.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
సంబంధిత కథనం