ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు కన్నడ థ్రిల్లర్ చిత్రాలు.. గ్రిప్పింగ్‍గా నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా సాగే సినిమాలు-5 kannada thriller to watch on otts birbal trilogy case 1 urvi to amazon prime video zee netflix streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు కన్నడ థ్రిల్లర్ చిత్రాలు.. గ్రిప్పింగ్‍గా నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా సాగే సినిమాలు

ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు కన్నడ థ్రిల్లర్ చిత్రాలు.. గ్రిప్పింగ్‍గా నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా సాగే సినిమాలు

కన్నడలో చాలా థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి. డిఫరెంట్ స్టోరీలతో తెరకెక్కాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు చిత్రాలు ఇవి. ఏ ఓటీటీల్లో ఉన్నాయో కూడా చూడండి.

ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు కన్నడ థ్రిల్లర్ చిత్రాలు.. గ్రిప్పింగ్‍గా నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా సాగే సినిమాలు

థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తుంటారు. థ్రిల్లర్లు ఉత్కంఠభరితంగా సాగితే వేరే భాషల సినిమాలైనా సబ్‍టైటిల్స్ పెట్టుకొని మరీ వీక్షిస్తుంటారు. అలాంటి వారి కోసమే కన్నడలో వచ్చిన థ్రిల్లర్లలో ఐదు బెస్ట్ ఆప్షన్లు ఇవి. కన్నడలో చాలా థ్రిల్లర్లు వచ్చాయి. అందులో కొన్ని గ్రిప్పింగ్‍గా ఉంటూ ఆకట్టున్నాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సిన ఐదు సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

బీర్బల్ ట్రయాలజీ కేస్ 1

క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ 1’ (2019) ఇంట్రెస్టింగ్‍గా సాగుతుంది. ఎంజీ శ్రీనివాస్, రుక్మిణి వసంత్, వినీత్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ద్వారానే రుక్మిణి తెరంగేట్రం చేశారు. ఓ హత్య గురించి విష్ణు ఓ బార్ టెండర్ పోలీసులకు సమాచారం ఇస్తాడు. అయితే, ఈ కేసులో అతడినే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు శిక్ష వేస్తుంది. నిజం నిరూపించి అతడిని విడిపించేందుకు లాయర్ మహేశ్ దాస్ రంగంలోకి దిగుతాడు. ఇందులో మిస్టరీ ఏంటనేది ఈ చిత్రంలో ఉంటుంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన ఎంజీ శ్రీనివాసే దర్శకుడు కూడా. బీర్బల్ ట్రయాలజీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. యూట్యూబ్‍లో కూడా చూడొచ్చు.

వ్రిత్ర

వ్రిత్ర సినిమాలో నిత్య శ్రీ, ప్రకాశ్ బెలవాది, సుధారాణి లీడ్ రోల్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆర్.గౌతమ్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఓ సూసైడ్ కేసును పోలీస్ ఆఫీసర్ ఇందిరా రావు దర్యాప్తు చేస్తారు. ముందు అది ఆత్మహత్యగానే భావించినా.. ఆ తర్వాత అనుకోని విషయాలు తెలుస్తాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఇందిరా ప్రయత్నిస్తుంది. సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈ వ్రిత్ర (2019) చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

శివాజీ సూర్తకల్

మిస్టరీ థ్రిల్లర్ ‘శివాజీ సూర్తకల్’ సినిమాలో రమేశ్ అరవింద్, రాధిక నారాయణ్, అరోహీ నారాయణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ మంత్రి కుమారుడి చావు వెనుక మిస్టరీని ఛేదించేందుకు డిటెక్టివ్ శివాజీ సూర్తకల్ ప్రయత్నించడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. 11 మంది అనుమానితులు ఉంటారు. ఆకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2020లో థియేటర్లలో విడుదలైంది. శివాజీ సూర్తకల్ సినిమాను ఇప్పుడు జీ5 ఓటీటీలో చూడొచ్చు. యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.

కేస్ ఆఫ్ కొండన

కేస్ ఆఫ్ కొండన చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, భావన ప్రధాన పాత్రలు పోషించారు. అసిస్టెంట్ సబ్‍‍ఇన్‍స్పెక్టర్, మరో పోలీస్ మధ్య ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఓ నేరస్తుడి కోసం ఏసీపీ లక్ష్మి ప్రయత్నిస్తుంటే.. లోకల్ గ్యాంగ్‍స్టర్‌ను పట్టుకునేందుకు ఏఎస్ఐ విల్సన్ ట్రై చేస్తుంటాడు. ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. వ్యక్తిగత జీవితాలకు కూడా ముడిపడి ఉంటాయి. కేస్ ఆఫ్ కొండన మూవీకి దేవీ ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జియోహాట్‍స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

కవాలుదారి

కవాలుదారి (2019) సినిమాకు హేమంత్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రిషి ప్రధాన పాత్ర పోషించారు. ట్రాఫిక్ పోలీస్‍గా పని చేసే శ్యామ్ (రిషి)కి ఓ రోడు రోడ్డు నిర్మాణ పనుల్లో ఓ అస్తిపంజరం కనిపిస్తుంది. క్రైమ్ పోలీసులకు చెప్పినా దర్యాప్తు చేయరు. దీంతో సొంతంగా అతడే ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అనూహ్యమైన విషయాలు బయటపడతాయి. పెద్ద కుట్ర ఉంటుందని గుర్తిస్తాడు. కవాలుదారి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం