OTT: ఈ ఏడాది అత్యధిక ప్రశంసలు పొందిన రూ.5కోట్ల బడ్జెట్ మూవీ.. మీరు చూశారా? స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT: ఈ ఏడాది ఓ బాలీవుడ్ మూవీ అత్యధికంగా ప్రశంసలు పొందింది. రూ.5కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం మామూలు ప్రేక్షకుల నుంచి ప్రముఖుల వరకు చాలా మంది హృదయాలను గెలిచింది. ఓటీటీలోకి వచ్చాక ఈ చిత్రం మరింత ఎక్కువ పాపులర్ అయింది. ఆ వివరాలు ఇవే..
బడ్జెట్ తక్కువే అయినా.. మంచి కంటెంట్‍తో కొన్ని చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంటాయి. మనసులను తాకి, ఆలోచింపజేసి ప్రశంసలను పొందుతుంటాయి. సింపుల్‍గా ఉంటూనే అద్బుతం అనేలా చేస్తాయి. అలాంటి సినిమానే ‘లాపతా లేడీస్’. ఈ ఏడాది అత్యధికంగా ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఈ మూవీ మొదటి వరసలో ఉంది. ఈ సెటైరికల్ కామెడీ డ్రామా సినిమాకు సాధారణ ప్రేక్షకులతో పాటు చాలా మంది సెలెబ్రిటీల నుంచి కూడా భారీగా ప్రశంసలు వచ్చాయి. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆస్కార్ పోటీకి కూడా ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైంది. ఈ ‘లాపతా లేడీస్’ సినిమా గురించి ఇక్కడ తెలుసుకోండి.
కొత్త నటీనటులతో..
లాపతా లేడీస్ చిత్రంలో ఎక్కువ శాతం కొత్త నటీనటులే చేశారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, స్పర్శ్ శ్రీవాత్సవ, ప్రతిభ రంటా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ముగ్గురు కొత్తవారే అయినా తమ నటనతో చాలా మెప్పించారు. వారి పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్‍గా నిలిచింది. సహజంగా పాత్రల్లో తమ పాత్రల్లో లీనమై మెప్పించారు. లాపతా లేడీస్ మూవీలో రవికిషన్, ఛాయా కదమ్, గీతా అగర్వాల్ శర్మ, దుర్గేశ్ కుమార్ కీలకపాత్రల్లో కనిపించారు.
కిరణ్ రావ్, ఆమిర్ ఖాన్ కాంబో
లాపతా లేడీస్ చిత్రానికి కిరణ్ రావ్ దర్శకత్వం వహించారు. కొత్తగా పెళ్లయిన ఇద్దరు అమ్మాయిల జీవితాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. సరదాగా సాగే ఈ చిత్రం సెటైరికల్‍గా ఉంటుంది. సమాజంలో అమ్మాయిలపై కట్టుబాట్లు, ఆంక్షలు ఎలా ఉంటాయో, వారు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో చూపిస్తుంది. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతీ దేశ్‍పాండే ఈ మూవీని నిర్మించారు. ఈ లాపతా లేడీస్ మూవీకి సుమారు రూ.5కోట్లలోపు బడ్జెట్ అయింది.
థియేటర్లలో సక్సెస్.. ఓటీటీ తర్వాత భారీ పాపులారిటీ
లాపతా లేడీస్ చిత్రం గతేడాదిలోని టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ ఏదాది 2024 మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం థియేటర్లలోనూ మంచి సక్సెస్ సాధించింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. అయితే, ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన తర్వాత మూవీకి చాలా పాపులర్ అయింది. ప్రేక్షకులు, సెలెబ్రిటీలు చాలా మంది ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, ఆలియా భట్, జోయా అక్తర్ ఇలా చాలా మంది ఈ మూవీపై పొగడ్తలు కురిపించారు. సోషల్ మీడియాలో ఈ మూవీపై బజ్ విపరీతంగా నడిచింది. మనసులను ఈ చిత్రం హత్తుకుందని, బెస్ట్ చిత్రం అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
దేని గురించి ఈ మూవీ
కొన్ని ఆచారాలు, కట్టుబాట్ల పేర్లతో కొందరు అమ్మాయిల లక్ష్యాలు, ఇష్టాలు ఎలా అణచివేతకు గురవుతున్నాయో, వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో లాపతా లేడీస్ మూవీలో చూపించారు దర్శకురాలు కిరణ్ రావ్. ఈ సీరియస్ అంశాలను సరదాగా ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. కొత్తగా పెళ్లయి రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఫూల్ కుమారి (నితాన్షి గోయెల్), జయా త్రిపాఠి అలియాజ్ పుష్ప రాణి (ప్రతిభ రంటా) చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్‍గానూ ఉంటుంది. అందుకే ఈ మూవీ మరింత ఆకట్టుకుంది. లాపతా లేడీస్ చిత్రాన్ని ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
ఆస్కార్ అవార్డు కోసం ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా లాపతా లేడీస్ ఎంపికైంది. అయితే, ఆస్కార్ నామినేషన్ల షార్ట్ లిస్టులో చోటు దక్కలేదు.
సంబంధిత కథనం