పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఐదు బాలీవుడ్ సినిమాలు.. చదువుపై ఆసక్తిని, స్ఫూర్తిని పెంచుతాయి.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే!-5 bollywood movies show watch every kid im kalam to 12th fail tare jameen par amazon prime video ott hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఐదు బాలీవుడ్ సినిమాలు.. చదువుపై ఆసక్తిని, స్ఫూర్తిని పెంచుతాయి.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే!

పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఐదు బాలీవుడ్ సినిమాలు.. చదువుపై ఆసక్తిని, స్ఫూర్తిని పెంచుతాయి.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే!

కొన్ని సినిమాలు పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. చదువుపై ఆసక్తిని పెంచుతాయి. బాలీవుడ్‍లో ఇలాంటి చిత్రాలు కొన్ని వచ్చాయి. వాటిలో పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఐదు సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

పిల్లలు తప్పకుండా చూడాల్సిన ఐదు బాలీవుడ్ సినిమాలు.. చదువుపై ఆసక్తిని, స్ఫూర్తిని పెంచుతాయి.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే!

సినిమాల ద్వారా నేర్చుకునే విషయాలు పిల్లలకు బాగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారికి వీలైనప్పుడు స్ఫూర్తి కలిగించే చిత్రాలను పెద్దలు చూపించాలి. చదువుపై ఆసక్తిని కలిగించేలా కూడా కొన్ని సినిమాలు ఉంటాయి. ఇలాంటి సినిమాలను పిల్లలను చూపించేందుకు వేసవి సెలవులు సరైన సమయం. బాలీవుడ్‍లో వచ్చిన కొన్ని చిత్రాలు పిల్లల్లో స్ఫూర్తిని పెంచేలా ఉన్నాయి. వాటిలో ఐదు సినిమాల గురించి.. అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. ఈ సెలవుల్లో వీలైనప్పుడు పిల్లలకు చూపించండి. అవేవంటే..

ఐయామ్ కలాం

రోడ్‍సైడ్ చిన్న టీ షాప్‍లో పని చేసే చోటూ (హర్ష మహర్) చుట్టూ ఐయామ్ కలాం సినిమా స్టోరీ ఉంటుంది. 2011లో వచ్చిన ఈ చిత్రం చాలా ప్రశంసలను అందుకుంది. బాగా చదువుకోవాలని, అప్పటి భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత గొప్పవాడని కావాలని కలలు కంటూ ఉంటాడు చోటూ. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల అతడిని చదివించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించరు. కానీ చదువుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు చోటూ. స్కూల్‍కు వెళ్లాలన్న చోటూ అలియాజ్ కలాం ఆశ నెరవేరిందా అనేది ఐయామ్ కలాం సినిమాలో ఉంటుంది.

పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా చదువుకోవాలని చోటూలో ఉండే సంకల్పం పిల్లల్లో స్ఫూర్తిని నింపుతుంది. విద్య కోసం సరైన సౌకర్యాలు లేని పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుస్తుంది. ఈ మూవీని పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా చూపించాలి. ఈ మూవీకి నీలా మర్హబ్ పాండా దర్శకత్వం వహించారు. ఐయామ్ కలాం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతోంది. యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.

ట్వెల్త్ ఫెయిల్

ఎంతో మారుమూల ప్రాంతంలో ఉన్నా.. విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరవచ్చని ట్వెల్త్ ఫెయిల్ (12th Fail) మూవీ స్ఫూర్తిని ఇస్తుంది. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రన విఫలమైనట్టు కాదని, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యానికి చేరవచ్చని ఈ మూవీ చెబుతుంది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ట్వెల్త్ ఫెయిల్ చిత్రం రూపొందింది. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనోజ్ కుమార్ పాత్ర పోషించారు విక్రాంత్ మాసే. ఈ మూవీ భారీ సక్సెస అవడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది. ట్వెల్త్ ఫెయిల్ చిత్రం జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులోనూ చూడొచ్చు.

శకుంతలా దేవి

హ్యూమన్ కంప్యూటర్‌గా ఖ్యాతి గడించిన భారత గణిత శాస్త్ర దిగ్గజం శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ శకుంతలా దేవి (2020) చిత్రంలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి శాకుంతల దేవి.. మ్యాథమాటిక్స్‌లో ఎలాంటి అద్భుతాలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఎలా పాపులర్ అయ్యారనే విషయాలు స్ఫూర్తివంతంగా ఉంటాయి. లెక్కలను ఛాలెంజ్‍గా తీసుకుంటే ఎంతో సరదాగా నేర్చుకోవచ్చని ఈ చిత్రం తెలుపుతుంది. ఈ చిత్రం చూస్తే పిల్లలకు గణితంపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.

తారే జమీన్ పర్

ప్రతీ చిన్నారి ప్రత్యేకమే, ప్రతీ ఒక్కరిలో ఏదో ఓ టాలెంట్ ఉంటుందని ‘తారే జమీన్ పర్’ (2007) చిత్రం చెబుతుంది. ఇషాన్ అవస్తి (దర్శల్ సఫరే) అనే ఎనిమిదేళ్ల బాలుడి చుట్టూ ఈ మూవీ సాగుతుంది. చదువులో వెనుకబడ్డాడని ఇషాన్‍ను బోర్డింగ్ స్కూల్‍లో తల్లిదండ్రులు చేర్పిస్తారు. అక్కడ ఆర్ట్ టీచర్ రామ్ శంకర్ నికుంబ్ (ఆమిర్ ఖాన్).. ఇషాన్‍లోని పెయింట్ టాలెంట్ గుర్తిస్తాడు. ఈ చిత్రానికి ఆమిర్ ఖానే దర్శకత్వం వహించారు. తారే జమీన్ పర్ కూడా పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తుంది. పిల్లలను అర్థం చేసుకునే విషయంలో పెద్దలు అనుసరించాల్సినవి కూడా ఈ చిత్రంలోని కొన్ని ఉంటాయి. తారే జమీన్ పర్ చిత్రం యూట్యూ‍‍‍‍‍బ్‍లో అందుబాటులో ఉంది.

స్టాన్లీ కా డబ్బా

స్టాన్లీ అనే నాలుగో తరగతి పిల్లాడితో స్టాన్లీ కా డబ్బా సినిమా ఉంటుంది. ఆ స్కూల్‍లో హిందీ ఉపాధ్యాయుడు వర్మ.. పిల్లల లంచ్ బాక్సులు తీసుకొని కాస్త తింటూ ఉంటాడు. స్టాన్లీ మాత్రం పాఠశాలకు ఎప్పుడూ లంచ్ బాక్స్ తీసుకొని రాడు. దీంతో తన క్లాస్‍కు రావొద్దని వర్మ చెప్పేస్తాడు. ఆ తర్వాత స్టాన్లీ ఏం చేశాడు? అతడికి స్నేహితులు ఎలా సహకరించారు? అసలు స్టాన్లీ ఎందుకు బాక్స్ తీసుకురాడనే విషయాలు సినిమాలో ఉంటాయి. స్నేహం విలువను తెలుపడంతో పాటు పరిస్థితులతో పోరాడుతూ స్టాన్లీ ఎలా చదువుకుంటున్నాడన్న విషయాలు స్పూర్తిగా ఉంటాయి. స్టాన్లీ కా డబ్బా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యూట్యూబ్‍లోనూ ఉంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం