Actresses Hidden Talent: ఐదుగురు హీరోయిన్ల హిడెన్ టాలెంట్స్.. చాలా మందికి తెలియని విషయాలు ఇవి!
Actresses Hidden Talent: కొందరు హీరోయిన్లకు యాక్టింగ్, డ్యాన్సే కాకుండా మరికొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. వేరు వాటిలోనూ నైపుణ్యం సాధించారు. అలా ఐదుగురు హీరోయిన్ల అదనపు టాలెంట్స్ ఏవో ఇక్కడ చూడండి.

చాలా మంది సినీ హీరోయిన్లకు యాక్టింగ్ మాత్రమే కాకుండా వేరే టాలెంట్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా బయటికి రావు. సినిమాల్లోకి వచ్చాక యాక్టింగ్ పర్పార్మెన్స్, డ్యాన్స్‌లపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. కొందరు అప్పుడప్పుడు మాత్రం వారి అదనపు టాలెంట్ గురించి చెబుతుంటారు. దీంతో చాలా మంది ప్రేక్షకులను నటీమణుల ఇతర నైపుణ్యాల గురించి ఎక్కువగా తెలిసి ఉండదు. అలా ఐదుగురు హీరోయిన్లు హిడెన్ టాలెంట్స్ ఏవో ఇక్కడ చూడండి.
రకుల్‍ప్రీత్ సింగ్
రకుల్‍ప్రీత్ సింగ్ అందం, అభినయంతో మెప్పిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‍కు చేరారు. టాలీవుడ్‍లో చాలా చిత్రాలు చేసిన రకుల్.. ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే, సినిమాల్లోకి రాకముందు రకుల్‍ప్రీత్.. గోల్ఫ్ క్రీడాకారిణి. జాతీయస్థాయిలో గోల్ఫ్ పోటీల్లోనూ ఆమె పాల్గొన్నారు. చాలా కాలం గోల్ఫ్ క్రీజలో శిక్షణ తీసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత గోల్ఫ్ ప్రాక్టీస్ ఆపేశారు రకుల్. ఎప్పుడో ఒకసారి అలా సరదాగా గోల్ఫ్ ఆడతారు.
కీర్తి సురేశ్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‍కు ఫ్యాషన్ డిజైనింగ్‍లోనూ మంచి టాలెంట్ ఉంది. సినిమాల్లోకి రాకముందు చెన్నై పర్ల్ అకాడమీలో ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ కోర్స్ చేశారు. కొన్నిసార్లు తన దుస్తులను కీర్తి డిజైన్ చేసుకుంటారట. అలాగే, కీర్తి సురేశ్ పెయింటింగ్ కూడా బాగా చేస్తారని సమాచారం. కీర్తిలో ఫ్యాషన్ డిజైనింగ్ టాలెంట్ ఉందని కొందరికే తెలుసు.
పూజా హెగ్డే
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. భరతనాట్యం డ్యాన్సర్ కూడా. ఆమె భరతనాట్యం శిక్షణను సుమారు పదేళ్ల పాటు తీసుకున్నారు. సంప్రదాయ సంగీతం కూడా ఆమె నేర్చుకున్నారు. అయితే, సినిమాల్లో భరతనాట్యం ప్రదర్శించే అవకాశం పూజకు పెద్దగా రాలేదు. దీంతో ఆమెలోని ఈ టాలెంట్ చాలా మందికి తెలియదు.
శ్రద్ధా కపూర్
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. మిమిక్రీ అదరగొడతారు. గొంతు మార్చి రకరకాలుగా ఆమె మాట్లాడగలరు. తన టీచర్‌ను శ్రద్దా మిమిక్రీ చేయడం గతంలో బాగా వైరల్ అయింది. అలాగే, మరికొందరి గొంతులను ఆమె మిమిక్రీ చేయగలరు. రకరకాల యాసల్లో ఆమె మాట్లాడతారు. ఓసారి కపిల్ శర్మ షోలో తన మిమిక్రీ టాలెంట్ బయటపెట్టారు శ్రద్ధా కపూర్.
రాశీ ఖన్నా
టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా.. పాటలు కూడా చక్కగా పాడగలరు. సినిమాల్లోనూ కొన్ని పాటలు పాడారు రాశీ. జోరు, విలన్ (మలయాళం), బాలకృష్ణుడు, జవాన్, ప్రతీ రోజూ పండుగే సహా మరిన్ని కొన్ని చిత్రాల్లో పాటలు ఆలపించారు రాశీ. ప్రొఫెషనల్ సింగర్‌లా ఆమె పాడగలరు.
సంబంధిత కథనం