లవ్యూ సిద్ధార్థ్.. 3 బీహెచ్‌కే మూవీ అదిరింది.. వైరల్ గా ఫ్యాన్స్ రియాక్షన్స్.. నటుడు శింబు రివ్యూ ఇదే-3bhk movie review twitter reaction fans comments on x goes viral siddharth sarath kumar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  లవ్యూ సిద్ధార్థ్.. 3 బీహెచ్‌కే మూవీ అదిరింది.. వైరల్ గా ఫ్యాన్స్ రియాక్షన్స్.. నటుడు శింబు రివ్యూ ఇదే

లవ్యూ సిద్ధార్థ్.. 3 బీహెచ్‌కే మూవీ అదిరింది.. వైరల్ గా ఫ్యాన్స్ రియాక్షన్స్.. నటుడు శింబు రివ్యూ ఇదే

3 బీహెచ్‌కే ట్విట్టర్ రివ్యూస్: సిద్ధార్థ్, శరత్ కుమార్, మీతా రఘునాథ్, దేవయాని నటించిన ఫ్యామిలీ డ్రామా 3 బీహెచ్‌కే మూవీకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఎక్స్ లో ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్ గా మారింది.

3 బీహెచ్‌కే మూవీ స్టిల్

సిద్ధార్థ్, శరత్ కుమార్, మీతా రఘునాథ్, దేవయాని, యోగిబాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా మూవీ 3 బీహెచ్‌కే. ఈ రోజు (జూలై 4) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వచ్చిన రివ్యూల ప్రకారం సినిమా మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు హృదయాన్ని హత్తుకునే కథతో నిండి ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని చూసి తమిళ హీరో శింబు (సిలంబరసన్ టీఆర్) కూడా మనసు పారేసుకున్నాడు.

అందమైన సినిమా

సిలంబరసన్ టిఆర్ అలియాస్ శింబు ఎక్స్ లో ఇలా రాసుకొచ్చాడు. “3 బీహెచ్‌కే చూశాను. ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్లే హృద్యమైన అందమైన చిత్రం. టీమ్ అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్'' అని శింబు పేర్కొన్నాడు. ‘‘3 బీహెచ్‌కే నన్ను బాల్యంలోకి తీసుకెళ్లింది’’ ఒక ఎక్స్ యూజర్.. 'కంప్లీట్ ఫిల్మ్' అని పిలిచాడు, ‘‘3 బీహెచ్‌కే అంటే ప్రేమ, 3 బీహెచ్‌కే అనేది వాస్తవం, 3 బీహెచ్‌కే జీవితం. అన్ని రకాల భావోద్వేగాలతో నిండిన కంప్లీట్ సినిమా. ప్రతి ఒక్కరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు’’ అని పేర్కొన్నాడు.

రియలిస్టిక్ మూవీ

"3 బీహెచ్‌కే చాలా మధురమైన, హృదయపూర్వకమైన, ఆరోగ్యకరమైన చిన్న చిత్రం. ఏమైనా చెప్పొచ్చు కానీ సినిమా ఎంత ప్యూర్ గా ఉందో కాదనలేం. సిద్ధార్థ్, మీథా, శరత్, చైత్ర అద్భుతంగా నటించారు. అమృత్ నుంచి అదిరిపోయే అరంగేట్రం. అది మీ హృదయాలను గెలుచుకుంటుంది" అని ఒక యూజర్ పేర్కొన్నాడు. చాలా మంది ప్రేక్షకులు 3 బీహెచ్‌కే అన్నింటికీ మించి 'రియలిస్టిక్' సినిమా అని అంగీకరించారు, "3 బీహెచ్‌కే ఉద్వేగభరితమైన, చాలా రియలిస్టిక్ చిత్రం! (4/5) దశాబ్దాల తర్వాత శరత్ కుమార్ కు ఉత్తమ పాత్ర దక్కింది. సిద్ధార్థ్ నుంచి అద్భుతమైన నటన. మీతా రఘునాథ్ బోల్డ్. సాంగ్ ప్లేస్ మెంట్ నీట్ & ఆప్ట్. చాలా ఎమోషనల్ సీన్స్ రిలేటివ్ గా ఉంటాయి. కేవలం సినిమా మాత్రమే కాదు.. ఓవరాల్ గా చూడాల్సిన విషయం" అని ఓ నెటిజన్ ప్రశంసించాడు.

గర్వంగా ఉంది

మంచి స్క్రిప్ట్ లను ఎంచుకున్న సిద్ధార్థ్ గురించి ఒక వ్యక్తి గర్వంగా చెప్పాడు. "నేను సిద్ధార్థ్ స్క్రిప్ట్ ఎంపికకు పెద్ద అభిమానిని. సివప్పు మంజల్ పచ్చై, అరువం, చిట్టా, ఇప్పుడు 3 బీహెచ్‌కే" అని చెప్పాడు. మరొకరు తమను బాల్యంలోకి తీసుకెళ్లిందన్నాడు. "ఇప్పుడే సినిమా చూశాను.. 3 బీహెచ్‌కే కు ధన్యవాదాలు.. మాటలు రావడం లేదు. మీరు నన్ను నా బాల్యంలోకి తీసుకువెళ్ళారు. వర్తమానం, భవిష్యత్తు ద్వారా నన్ను నడిపించారు. మాటలు లేవు. సిద్ధార్థ్ అభిమానిగా ఉండటం కంటే గర్వంగా ఉండలేను. ఐ లవ్ యూ సిద్ధార్థ్" అని తెలిపాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం