Bollywood: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. సూపర్ హిట్లతో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్.. నేటితో 23ఏళ్లు-23 years for lagaan vs gadar at bollywood box office clash to movies is super hits now when to watch now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. సూపర్ హిట్లతో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్.. నేటితో 23ఏళ్లు

Bollywood: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. సూపర్ హిట్లతో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్.. నేటితో 23ఏళ్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 15, 2024 04:57 PM IST

Bollywood - Lagaan vs Gadar: బాలీవుడ్‍లో లగాన్, గదర్ సినిమాలు ఒకే రోజు రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే రెండు చిత్రాలు భారీ బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Bollywood: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. సూపర్ హిట్లతో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్.. నేటితో 23ఏళ్లు
Bollywood: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. సూపర్ హిట్లతో పాటు కల్ట్ క్లాసిక్ స్టేటస్.. నేటితో 23ఏళ్లు

Bollywood: ఒకే ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడం చాలా తక్కువసార్లు జరుగుతుంటుంది. బాలీపుడ్‍లో 2001లో ఇలాంటి బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. 2001 జూన్ 15వ తేదీన స్టార్ హీరో ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లగాన్, సన్నీ డియోల్ హీరోగా ఉన్న గదర్ విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాలీవుడ్‍లో కల్ట్ క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. ముఖ్యంగా లగాన్ అదిరిపోయే హిట్ అయింది. నేటితో (జూన్ 15) లగాన్, గదర్ బాక్సాఫీస్ క్లాష్‍కు 23 ఏళ్లు ముగిశాయి. ఈ సందర్భంగా ఈ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

లగాన్

స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ‘లగాన్’ తెరకెక్కింది. బ్రిటీషర్లతో చంపారన్ గ్రామస్తులు పందెం వేసి క్రికెట్ ఆడడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో గ్రేసీ సింగ్, రేచల్ షెల్లీ, పౌల్ బ్లా‍క్‍త్రోన్, సుహాసినీ ములే, కుల్‍భూషణ్ కల్బంద కీలకపాత్రలు పోషించారు.

లగాన్ చిత్రానికి అషుతోశ్ గ్రోవారికర్ దర్శకత్వం వహించారు. క్రికెట్, దేశభక్తి, ఎమోషన్లు, పాటలు, నటీనటుల పర్ఫార్మెన్స్ ఇలా ఈ మూవీలోని అనేక అంశాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. అప్పట్లో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా వచ్చింది. ఆమిర్ ఖాన్, సంజయ్ దైమా ఈ మూవీని నిర్మించారు. 2001 జూన్ 15న ఈ చిత్రం రిలీజ్ అయింది.

లగాన్ సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఆరంభం నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారు రూ.65కోట్ల వరకు కలెక్షన్లను దక్కించుకుంది. అప్పట్లో ఇది భారీ బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. ఆస్కార్ నామినేషన్లకు కూడా వెళ్లినా కాస్తలో అవార్డు మిస్ అయింది. లగాన్ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టదని చెప్పే ప్రేక్షకులు కోకొల్లు. ఈ మూవీని ఇప్పుడు కావాలంటే యూట్యూబ్‍లో చూడొచ్చు.

గదర్

గదర్: ఏక్ ప్రేమ్ కథ మూవీలో సన్నీ డియోల్, ఆమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. పీరియాటిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది. ఈ మూవీకి అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఆమ్రిష్ పురి, లిలెట్ దూబే, వివేక్ షేక్, ఉత్కర్ష్ శర్మ, సురేశ్ ఒబేరాయ్, మధు మల్టీ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ కథ కూడా భారత స్వాతంత్య్రానికి ముందే మొదలవుతుంది.

గదర్ సినిమా ఎమోషన్లలో, ఇంటెన్స్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించగా.. ఉత్తమ్ సింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా కూడా బాలీవుడ్‍లో క్లాసిక్ చిత్రంగా నిలిచింది. 2001 జూన్ 15న రిలైన ఈ చిత్రం కమర్షియల్‍గానూ బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు రూ.18.5 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ దాదాపు రూ.100కోట్ల వరకు వసూళ్లు సాధించిందనే అంచనాలు ఉన్నాయి. గదర్ మూవీని నితిన్ కేనీ, భన్వర్ సింగ్, భౌమిక్ గండాలియా నిర్మించారు. గదర్ చిత్రాన్ని ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చు.

గదర్ చిత్రానికి 22 ఏళ్ల తర్వాత గత సంవత్సరం 2023లో సీక్వెల్ వచ్చింది. ఈ గదర్ 2 మూవీలో సన్నీ డియోల్, అమిషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. గదర్ 2 ఏకంగా సుమారు రూ.690కోట్ల కలెక్షన్లు సాధించి భారీ బ్లాక్‍బస్టర్ అయింది.

WhatsApp channel