2018 Telugu Collections: తెలుగులోనూ 2018 కలెక్షన్ల వర్షం.. నాలుగు రోజుల్లోనే లాభాలు
2018 Telugu Collections: తెలుగులోనూ 2018 మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.
2018 Telugu Collections: మలయాళ సినిమా ఇండస్ట్రీ అందించిన మరో అద్భుతం 2018. ఈ మూవీ ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తోంది. రిలీజైనప్పటి నుంచే ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తున్న 2018 మూవీ.. తెలుగులోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుండం విశేషం. గత శుక్రవారం (మే 26) ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడల్లో రిలీజై విషయం తెలుసు కదా.
ట్రెండింగ్ వార్తలు
ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 2018 నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లకుపైగా వసూలు చేసింది. తెలుగులోనూ నాలుగు రోజుల్లోనే ఈ మూవీ లాభాల బాట పట్టడం విశేషం. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.5.24 కోట్లు వసూలు చేసింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.2.46 కోట్లు.
రిలీజ్ కు ముందు 2018 మూవీ తెలుగులో రూ.1.8 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ ను రూ.2 కోట్లుగా నిర్ణయించగా.. ఇప్పుడా సినిమా అంతకంటే ఎక్కువే సాధించింది. సోమవారం నాటికి రూ.46 లక్షల లాభాలు వచ్చాయి. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆంథనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన 2018 మూవీ తెలుగు ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకున్నట్లు కలెక్షన్లను చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ 2018 మలయాళ వెర్షన్ జూన్ 7న సోనీలివ్ ఓటీటీలో రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగుతోపాటు ఇతర వెర్షన్లలో ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఈ భాషల వెర్షన్లు తర్వాత రిలీజ్ చేయనున్నారు. 2018లో వరదల సందర్భంగా వందల మంది ప్రాణాలు కోల్పోయిన విపత్తులోనూ మలయాళీలు ఎలా కలిసికట్టుగా దానిని ఎదుర్కొన్నారో ఈ 2018లో చూపించారు.
సంబంధిత కథనం