చిరంజీవి, జాకీ ష్రాఫ్, శోభన, రేవతి, రమ్యకృష్ణన్, వెంకటేష్ దగ్గుబాటి వంటి 80ల నాటి సూపర్ స్టార్లు మరోసారి కలిశారు. ప్రతి ఏడాది మీట్ అయ్యే ఈ సెలబ్రిటీలు ఇప్పుడు మూడు సంవత్సరాల విరామం తర్వాత చెన్నైలోని నటుడు, దర్శకుడు రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ నివాసంలో కలిశారు.
1980ల నాటి మిత్రులతో చిరంజీవి సందడి చేశారు. గ్రూప్ ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు మెగాస్టార్.
‘‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఒక జ్ఞాపకాల ప్రయాణం. దశాబ్దాలుగా మేము పంచుకున్న విడదీయరాని బంధం అలాగే ఉంది. ఎన్నో అందమైన జ్ఞాపకాలు. ప్రతి కలయిక మొదటిసారి కలిసినంత తాజాగా అనిపిస్తుంది" అని చిత్రాలతో పాటు ఒక స్వీట్ నోట్ రాశారు చిరు.
సీనియర్ నటి రేవతి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కూడా ఈ ఫోటోలను పంచుకుంది. “క్లాస్ ఆఫ్ 80 స్టిల్ రాక్స్. మేము సాధారణంగా కలవని స్నేహితులను కలిసే సాయంత్రం… మేము కలిసి పనిచేసిన వ్యక్తులు… 12 సంవత్సరాలకు పైగా కలిసే ఏకైక సమూహం… లిస్సీ, హాసిని, పూర్ణిమ, రాజ్‌కుమార్. ఖుష్బులకు ధన్యవాదాలు. కలిసి ఉండటమే ఆనందంగా ఉండే సాయంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. క్లాస్ ఆఫ్ '80s రాక్!!!" అని ఆమె పేర్కొన్నారు.
అభిమానులు కూడా ఈ స్టార్లను ఒక్క చోట కలిసి చూడటంతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఒకే ఫ్రేమ్‌లో చాలా మంది పెద్ద స్టార్లు 👏👍ప్రియమైన స్నేహితుల కలయిక ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండటానికి, పూర్తి శక్తితో తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి చాలా మంచిది" అని ఓ ఫ్యాన్ రాసుకొచ్చాడు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిందీ చలనచిత్ర పరిశ్రమల నుండి మొత్తం 31 మంది స్టార్లు హాజరయ్యారు. ఈ సంవత్సరం పార్టీకి చిరుతపులి-ప్రింట్ దుస్తులు డ్రెస్ కోడ్‌గా ఉన్నాయి.
సంబంధిత కథనం