Pellante Idera: 14 మంది హీరోలు - ప‌న్నెండుగురు హీరోయిన్లు - తెలుగులో రిలీజైన గిన్నిస్ రికార్డ్ మూవీ ఏదో తెలుసా-14 heroes 12 heroines pellante idera movie shooting completed within 23 hours and set a guinness book record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pellante Idera: 14 మంది హీరోలు - ప‌న్నెండుగురు హీరోయిన్లు - తెలుగులో రిలీజైన గిన్నిస్ రికార్డ్ మూవీ ఏదో తెలుసా

Pellante Idera: 14 మంది హీరోలు - ప‌న్నెండుగురు హీరోయిన్లు - తెలుగులో రిలీజైన గిన్నిస్ రికార్డ్ మూవీ ఏదో తెలుసా

Nelki Naresh Kumar HT Telugu
May 25, 2024 08:23 AM IST

Pellante Idera: 14 మంది హీరోలు, ప‌న్నెండుగురు హీరోయిన్ల‌తో త‌మిళంలో సుయంవ‌రం అనే సినిమా తెర‌కెక్కింది. తెలుగులో పెళ్లంటే ఇదేరా పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న‌ది.

 పెళ్లంటే ఇదేరా
పెళ్లంటే ఇదేరా

Pellante Idera: ఓ సినిమా షూటింగ్ అంటే క‌నీసం ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ప‌ట్ట‌డం కామ‌న్‌. అది సోలో హీరో సినిమా అయితేనే ఏడాదిలోగా షూటింగ్‌ కంప్లీట్ అవుతుంది. మ‌ల్టీస్టార‌ర్ అయితే అనుకున్న‌దానికంటే ఎక్కువే టైమ్‌ప‌డుతుంది. కానీ త‌మిళంలో 14 మంది హీరోలు, ప‌న్నెండు మంది హీరోయిన్లు న‌టించిన ఓ సినిమా షూటింగ్ 23 గంట‌ల్లోనే పూర్త‌యింది. అతి త‌క్కువ టైమ్‌లో షూటింగ్ పూర్తిచేసుకున్న మూవీగా గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న‌ది. ఆ సినిమానే సుయంవ‌రం.

14 మంది హీరోలు...

కామెడీ డ్రామా క‌థాంశంతో 1999లో రిలీజైన ఈ సినిమాలో 14 మంది హీరోలు న‌టించారు. స‌త్య‌రాజ్‌, ప్ర‌భు, అబ్బాస్‌, వినీత్‌, అర్జున్‌, ప్ర‌భుదేవా, కార్తీక్‌, లివింగ్‌స్టోన్‌, పార్తీబ‌న్‌తో పాటు కోలీవుడ్‌లోని హీరోలంద‌రూ ఈ సినిమాలో క‌నిపించారు. సుయంవ‌రం సినిమాలో 12 మంది హీరోయిన్లు న‌టించారు.

రంభ‌, రోజా, మ‌హేశ్వ‌రి, ఖుష్బూ, హీరా, దేవ‌యాని, ఐశ్వ‌ర్య క‌స్తూరితో పాటు మ‌రికొంద‌రు త‌మిళ నాయిక‌లు ఈ మూవీలో న‌టించారు. ఈ సినిమాకు హీరోలు, హీరోయిన్లు మాత్ర‌మే కాకుండా డైరెక్ట‌ర్లు కూడా ప‌ధ్నాలుగుమంది ప‌ని చేశారు. సుంద‌ర్‌సి, కేఎస్ ర‌వికుమార్‌, పి వాసు, అర్జున్‌తో పాటు అప్ప‌ట్లో త‌మిళంలో ఉన్న టాప్ డైరెక్ట‌ర్లు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

23 గంట‌ల్లో షూటింగ్ కంప్లీట్‌...

1999 మార్చి 24న షూటింగ్ మొద‌లైంది. 23 గంట‌ల యాభై ఎనిమిది నిమిషాల్లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశారు. అతి త‌క్కువ టైమ్‌లో షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఇండియ‌న్ మూవీగా సుయంవ‌రం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద‌క్కించుకున్న‌ది. ఇప్ప‌టికీ ఈ మూవీ రికార్డ్ ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేక‌పోయారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం చెన్నైలోనే జ‌రిగింది. ప్లానింగ్ ప్ర‌కారం 23 గంట‌ల్లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేశారు. మొత్తం 11 పార్ట్‌లుగా స్క్రిప్ట్‌ను డివైడ్ చేసి ఒక్కో ఆర్టిస్ట్ సీన్ల‌ను ఒక్కో డైరెక్ట‌ర్ వేర్వేరు ప్లేస్‌ల‌లో సేమ్ టైమ్‌లో షూట్ చేశారు.

సుయం వ‌రం సినిమాకు 19 మంది కెమెరామెన్లు, 19 మంది అసోసియేట్ డైరెక్ట‌ర్లు, 45 మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు, 145 మంది డ్యాన్స‌ర్లు...ఇలా పెద్ద టీమ్ ప‌నిచేశారు. ఈ సినిమా కోసం ప్ర‌భుదేవా సింగ‌ర్‌గా మారాడు. ఓ పాట పాడాడు.

పాజిటివ్ టాక్‌...

1999 జూలై 16న రిలీజైనసుయంవ‌రం మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఒకే సినిమాలో 26 మంది హీరోహీరియ‌న్ల‌ను చూసి ఆడియెన్స్ థ్రిల్‌గా ఫీల‌య్యారు. ఈ సినిమా తెలుగులో పెళ్లంటే ఇదేరా పేరుతో డ‌బ్ అయ్యింది. తెలుగు వెర్ష‌న్ నిర్మాత‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది.

క‌థ ఇదే...

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీతో ఈ మూవీ తెర‌కెక్కింది. కుసేల‌న్‌కు ముగ్గురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు ఉంటారు. హార్ట్ ఎటాక్ కార‌ణంగా కుచేల‌న్ ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది. తాను బ‌తికుండ‌గానే కొడుకులు, కూతుళ్ల పెళ్లి చూడాల‌ని అనుకుంటాడు. తండ్రి కోరిక‌ను ఆకొడుకులు, కూతుళ్లు ఎలా నెర‌వేర్చారు అనే క‌థాంశంతో పెళ్లంటే ఇదేరా మూవీ తెర‌కెక్కింది.

టీ20 వరల్డ్ కప్ 2024