100 Movies: జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?-100 movies completed star heroes in very short time super star krishna in 8 chiranjeevi in 10 mohanlal in 11 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  100 Movies: జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?

100 Movies: జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?

Sanjiv Kumar HT Telugu

100 Movies Completed Star Heroes In Very Short Time: అగ్ర హీరోలు అంతా కొన్ని వందల్లో సినిమాలు చేసి ఆడియెన్స్‌ను అలరించారు. అయితే, వీరిలో మొదటి 100 సినిమాలను అతి తక్కువ కాలంలో ఎవరు చేశారో ఇక్కడ తెలుసుకుందాం. వారిలో చిరంజీవి, మోహన్ లాల్, సూపర్ స్టార్ కృష్ణ వంటి స్టార్స్ కూడా ఉన్నారు.

జెట్ స్పీడ్‌లో 100 సినిమాలు చేసిన స్టార్ హీరోలు.. చిరంజీవి, మోహన్ లాల్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే?

100 Movies Completed Star Heroes In Very Short Time: ఈ మధ్య కాలంలో అతి వేగంగా సినిమాలు చేయడం చాలా కష్టమైంది. పాన్ ఇండియా రేంజ్‌లో హై బడ్జెట్‌తో అగ్ర హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అయితే, వాటికి సంవత్సరానికిపైగా సమయం పడుతుంది. దాంతో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనం అవుతోంది.

100 సినిమాలను పూర్తి చేయడానికి

ఈ నేపథ్యంలో వీరు 100 సినిమాలను పూర్తి చేయడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. అయితే, ఇంతకుముందు అతి వేగంగా వంద సినిమాలను అతి తక్కువ సంవత్సరాల్లో పూర్తి చేసిన అగ్ర హీరోలు ఉన్నారు. మరి జెట్ స్పీడ్‌లో 100 సినిమాలను పూర్తి చేసిన స్టార్ హీరోలు ఎవరు, ఎవరికి ఎన్నేళ్లు పట్టిందో ఇక్కడ తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మోహన్ లాల్

మలయాళం సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరు గడించారు మోహన్ లాల్. ఇప్పుడు లూసిఫర్ ఎంపురాన్ (L2) సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, మోహన్ లాల్ 1978 నుంచి 89 మధ్యలో వంద సినిమాలను కంప్లీట్ చేశారు. అంటే, 100 చిత్రాలను పూర్తి చేసేందుకు మోహన్ లాల్ తీసుకున్న సమయం 11 సంవత్సరాలు.

మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పనవసరం లేదు. గతంలో అయితే ఏడాదిలో నాలుగైదు చిరంజీవి సినిమాలు వచ్చేవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పదేళ్లలో 100 సినిమాలను పూర్తి చేశారు. అది 1978 నుంచి 1988 మధ్య కాలంలో పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇలా చూస్తే ఒక నెలలో ఒక సినిమాలో నటించినట్లుగా తెలుస్తోంది.

తెలుగు సూపర్ స్టార్ కృష్ణ

దివంగత, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అతి వేగంగా సినిమాలు చేశారనే టాక్ ఇండస్ట్రీలో ఎప్పుడు గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కరోజులోనే ఏకంగా మూడు షిఫ్టుల్లో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అలా జెట్ స్పీడ్‌లో సినిమాలను పూర్తి చేసేవారని టాక్. 1974 నుంచి 82 ఇలా 8 ఏళ్లలోనే వంద సినిమాలను సూపర్ స్టార్ కృష్ణ పూర్తి చేశారు. ఇలా అతి వేగంగా 100 సినిమాలు చేసి మోహన్ లాల్, చిరంజీవి కంటే టాప్‌లో సూపర్ స్టార్ కృష్ణ నిలిచారు.

సుహాస్-ప్రభాస్-నాని

ఇక ఈ మధ్య కాలంలో చిన్న బడ్జెట్‌తో అతి వేగంగా సినిమాలు చేస్తున్న హీరో సుహాస్ అని చెప్పుకోవచ్చు. ఒక్క 2024లోనే ఐదారు వరకు సుహాస్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇక హై బడ్జెట్‌, పాన్ ఇండియా రేంజ్‌లో కూడా వేగంగా సినిమాలు చేస్తుంది ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ నటీనటులు ఉన్నప్పటికీ ప్రభాస్ సంవత్సరానికి 2 సినిమాల వరకు రిలీజ్ చేస్తున్నాడు. ఇక మీడియం రేంజ్ హీరోల్లో నాని జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్నాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం