Secunderabad Loksabha: సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో నిలిచేది ఎవరు? ప్రధాన పార్టీల్లో అభ్యర్ధులపై ఆసక్తి
Secunderabad Loksabha: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. లోక్‌సభ స్థానాల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Secunderabad Loksabha: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల Elections పోరు కూడా ఆసక్తికరంగా మారింది.
బీజేపీ సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Kishan reddy ఇక్కడ నుంచి మరోసారి టికెట్ దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ తన పని తానూ చేసుకుంటూ పోతున్నారు.
మరోవైపు కాంగ్రెస్,బిఆర్ఎస్ ల నుంచి ఎవరు రంగంలో దిగుతున్నారు అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.అధికార కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క చోట కూడా గెలుపు నమోదు చేసు కోలేక పోయింది. గ్రేటర్ లో కలిసి ఉన్న మూడు జిల్లాలో కలిపి హస్తం పార్టీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి Revanth reddyప్రత్యేక దృష్టి పెట్టారు.
అతనికే ఎక్కువ అవకాశాలు...
గ్రేటర్ పరిధిలోకి వచ్చే చార్మినార్ సంగతి పక్కకు పెడితే, మిగతా మూడు నియోజక వర్గాల్లో జెండా ఎగరు వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే చేవెళ్ల, మల్కాజ్ గిరి తో పాటు సికింద్రాబాద్‌లో గెలుపు గుర్రాల కోసం వెతికే పనిలో పడింది.
సొంత పార్టీ వారిని కాదని గెలుపు అవకాశాలు ఉన్న వలస నేతలకు టికెట్ ఇచ్చేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ ఆశావహుల ఎందరో ఉన్నా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కారు పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన నేతలకే టికెట్ ఇవనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న నగర మాజీ మేయిర్ రామ్మోహన్ దంపతులు ప్రస్తుత డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. వారిలో బొంతు రామ్మోహన్ కు టికెట్ దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నట్టుండి కారు దిగి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది.
దానం Danam Nagender ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ సికింద్రబాద్ పరిధిలోకి రావడం,మిగతా ప్రాంతాల్లో ఆయనకు బలమైన అనుచర గణం ఉండడం తో దానం నాగేందర్ కు టికెట్ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంకొందరు మాత్రం దానం నాగేందర్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని చెబుతున్నారు. మరోవైపు కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మరికొందరు నేతలు చేరుతారని చెబుతున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ గ్రేటర్ పరిధిలో ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ పార్టీ సైతం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై ఇంకా సైలెంట్ మోడ్‌లోనే ఉంది. ఈ స్థానం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ Talasani Srinivas కుమారుడు సాయి ఈసారి మాత్రం పోటీకి నిరాకరిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ నియోజక వర్గంలో పోటీ చేే అభ్యర్థులపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)