Adilabad Election Results: ఆదిలాబాద్‌లో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు
Adilabad Election Results: ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలు ఉంటే నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్, నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి, రెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ లు గెలుపొందాయి.
Adilabad Election Results: ఉమ్మడి ఆదిలాబాదు ఎన్నికల ఫలితాల్లో అన్ని పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాలుగు నియోజక వర్గాల్లో కాంగ్రెస్, నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి, రెండు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ లు గెలుపొందాయి.

ఎన్నికల ఫలితాలు మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు అధ్యంతం ఉత్కంట నెలకొంది, ప్రతి రౌండ్లో జిల్లాలో టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లో ఒకరిని మించి మరొకరు ముందుకు వెళ్లారు. నిర్మల్ నియోజవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోగా, చెన్నూరు నియోజవర్గంలో బాల్క సుమన్ ఓటమి పాలయ్యారు,
ఆదిలాబాదులో మాజీ మంత్రి రమణ ఓడిపోయారు, జిల్లాలో ఫలితాలు పరిశీలిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను స్థానికంగా ఉండే నాయకులలో సేవ చేసే నాయకుడు ఎవరని ఆలోచించి ఓటు వేశారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకే గెలుపొందిన ఎమ్మెల్యేలు దాదాపు గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారే ఉండడం గమనార్హం.
ఫలితాలు ఇలా ఉన్నాయి…
ఉమ్మడి ఆదిలాబాద్ లో పది నియోజకవర్గాలలో పాయల శంకర్ బిజెపి నుండి సమీప బీ ఆర్ ఎస్ అభ్యర్థి జోగు రామన్న పై 6,147 ఓట్లతో గెలుపొందారు, బూతు నియోజవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ సమీప అభ్యర్థి సోయం బాపూరావుపై 22,000 మెజార్టీతో గెలుపొందారు, నిర్మల్ నియోజవర్గంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుమారు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సన్నిహితుడు ముఖ్య ఝాన్సీ నాయక్ పై కాంగ్రెస్ అభ్యర్థి వేడమ్మ బొజ్జు పటేల్ కేవలం 2000 మెజార్టీతో గెలుపొందారు.
ముధోల్ నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థి రామారావు పటేల్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ పై 20వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ పై 23000 వేల ఓట్లతో గెలుపొందారు.
సిర్పూర్ నియోజవర్గంలో బిజెపి అభ్యర్థి పాల్వాయి హరీష్ సమీప టిఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప పైన 2000 మెజారిటీతో గెలుపొందారు. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు సమీప బిజెపి అభ్యర్థి రఘునాథ్ పై 40 వేల మెజార్టీతో గెలుపొందారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ సమీప అభ్యర్థి దుర్గం చిన్నయ్య పై సుమారు 30 వేల మెజార్టీతో గెలుపొందారు. చెన్నూరు నియోజవర్గం లో గడ్డం వివేక్ సమీప అభ్యర్థి బాల్క సుమన్ పై 30000 మెజారిటీతో గెలుపొందారు.
ఫలించిన ఢిల్లీ నేతల పర్యటనలు
జిల్లాలో తరచూ ఢిల్లీ స్థాయి కాంగ్రెస్ నేతలు పర్యటించడంతో ఆదిలాబాదులో వివిధ వర్గాల్లో కాంగ్రెస్ బలం పుంజుకుందని చెబుతున్నారు. ఇందిరాగాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో, రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తరచు జిల్లాలో వివిధ చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆదివాసీల్లో హస్తం గుర్తుపై నమ్మకం పెరిగి ప్రభుత్వ వ్యతిరేకవర్లను ప్రత్యామ్నాయంగా చేతి గుర్తుకు వేశారని అందులో భాగంగానే గెలుపు సాధ్యమైందని తెలుస్తుంది.
రిపోర్టర్ : వేణుగోపాల్ కామోజీ,ఉమ్మడి ఆదిలాబాద్