MIM Halal Meat Issue: హలాల్ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుతున్న ఎంఐఎం నేతలు…
MIM Halal Meat Issue: యూపీలో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల తయారీతో పాటు అమ్మకాలను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం ప్రచారాస్త్రంగా మార్చుకుంటోంది.
MIM Halal Meat Issue: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం హలాల్ మాంసాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హలాల్ సంస్థలతో పాటు కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంత్రాలను వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంఐఎం నేతలు హలాల్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
యాకూత్ పురా మజ్లిస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ హుస్సేన్ తన ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో ప్రతీ చోట హలాల్ మాంసం దొరుకుతుందని ఎన్నటికీ హలాల్ మాంసం పై నిషేదం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తాము ఎల్లప్పుడూ హలాల్ అయిన మాంసాన్ని మాత్రమే తింటామని జాఫర్ వెల్లడించారు.తినే తిండి పై కూడా నిషేధం విధించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని అది సాధ్యమయ్యే పని కాదన్నారు జాఫర్.
హై ప్రోటీన్ ఉందని తెలిసి కొందరూ దొంగ చాటుగా ఆ మాంసాన్ని తింటున్నారు అన్నారు . కొందరు సీక్రెట్‌గా తింటే తాము బహిరంగంగా తింటమాని ఇద్దరికీ అదొక్క తేడా మాత్రమే ఉందన్నారు యూపీ ప్రభుత్వం హలాల్ నిషేధించడాన్ని తప్పు పట్టారు.
ప్రజల మతపరమైన భావాలను క్యాష్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు నకిలీ హలాల్ సర్టిఫికెట్లతో అమ్మకాలకు యత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం పేర్కొంది. యుపిలో హలాల్ నిషేధించడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని భజ్రంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది.
హలాల్ ఉత్పత్తుల ద్వారా వచ్చిన డబ్బుతో టెర్రరిస్టులకు నిధులు సమకురుస్తున్నరని సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే హలాల్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎన్నికల వేళ ఎంఐఎం నేతలు హలాల్ అంశాన్ని తెరపైకి తేవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)