Hyderabad : గచ్చిబౌలిలో రూ. 5 కోట్లు పట్టివేత
Cash Seized in Gachibowli :గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.అధికారుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది.గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా రెండు కార్లలో భారీగా నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అధికారులు అప్రత్తమై సోదాలు నిర్వహించి రూ.5 కోట్ల నగదు కు సరైన పాత్రలు లేనందున వాటిని అధికారులు సీజ్ చేశారు.అయితే ఈ నగదు ఒక బడా వ్యాపారవేత్తదిగా పోలీసులు అనుమానిస్తున్నారు.అనంతరం పెద్దపల్లికి చెందిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి మిగతా సమాచారం రాబడుతున్నారు.
ఇక మరోవైపు హయత్ నగర్, నాచారం పోలీసుస్టేషన్ల పరిధిలో బుధవారం అర్థరాత్రి పోలీసులు రూ.3.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట సదాశివ్ ఎన్ క్లేవ్ నుంచి భారీ మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు.
ఓ కారు డిక్కిలో చేతి సంచుల్లో ఉన్న రూ.2కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. హయత్ నగర్‌కు చెందిన శివకుమార్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తాటికొండ మహేందర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, రమేష్‌లను అదుపులోకి తీసుకొని విచారించారు. పట్టుబడిన నగదును చౌటుప్పల్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించినట్టు ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వర్రావు తెలిపారు.
ఎల్పీ నగర్, కొత్తపేటకు చెందిన బండి సుధీర్ రెడ్డి పాత కార్లు విక్రయిస్తుంటారు. బుధవారం కారులో భువనగిరి వెళ్తుండగా నాచారంలో పోలీసులు తనిఖీలు చేశారు. కారు ముందు డోర్లు పచ్చినంత సులువుగా వెనుక డోర్లు రాక పోవడంతో అనుమానించిన పోలీసులు వాటిని తెరిచి తనిఖీలు చేశారు.
కారు డోర్ల లోపలి భాగంలో రూ.1.20 కోట్ల నగదు బయట పడింది. హబ్సిగూడలోని లక్ష్మారెడ్డి నుంచి డబ్బు తీసుకొస్తున్నట్లు గుర్తించినట్టు మల్కాజ్‌గిరి అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు. నగదు తరలింపుపై విచారణ జరుపుతున్నారు.