Barrelakka : రౌడీ రాజ్యాన్ని కళ్లారా చూస్తున్నాం, సోదరుడిపై దాడితో బర్రెలక్క కన్నీటి పర్యంతం
Barrelakka : కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క(శిరీష) సోదరుడిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె సోదరుడిపై దాడి చేశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
Barrelakka : హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్రెలక్క అలియాస్ శిరీష... కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతుంది. దీంతో పాటు శిరీషకు నిరుద్యోగుల సపోర్ట్ కూడా పెరుగుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న బర్రెలక్కకు ఇబ్బందులు తప్పడంలేదు. నామినేషన్ వేసినందుకు తనను వేధిస్తున్నారని, బీఆర్ఎస్ కు చెందిన వారు తనపై కేసు పెట్టారని ఆమె తెలిపింది. అయినా భయపడకుండా పోరాడుతున్నానన్నారు. బర్రెలక్కకు సోషల్ మీడియాలో రోజు రోజుకూ మద్దతు పెరుగుతుంది. గత కొద్దిరోజులుగా నిరుద్యోగులు చందాలు వేసి మరి ఆమెతో ప్రచారం చేయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం డిగ్రీ చదివింది. ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవుతుంది. అయితే పేపర్ల లీకులు, కోర్టు కేసులు, పరీక్షల వాయిదా పడడంతో నిరాశ చెందిన ఆమె... ఇంటి వద్దు బర్రెలను కాస్తూ ఓ వీడియో పెట్టింది. ఈ వీడియో వైరల్ అయింది.
బర్రెలక్క తమ్ముడిపై దాడి
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క తమ్ముడిపై దాడి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తన తమ్ముడిపై దాడి చేయడంపై బర్రెలక్క ఆవేదన చెందారు. చిన్న పిల్లవాడిపై మూకుమ్మడిగా దాడి చేశారని ఆరోపించారు. రౌడీ రాజ్యం అంటే ఇవాళ కళ్లారా చూస్తున్నామన్నారు. బెదిరింపులు కాదు, నియోజకవర్గంలో అభివృద్ధి చేయండని కోరారు. మాకు అన్నం పెడుతున్న తమ్ముడిపై దాడి చేశారని కన్నీరు పెట్టుకున్నారు.
"నేను నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్నాను. నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎవరు చేయించారో నాకు తెలుసు. అయినా ఎవరి పేర్లు చెప్పలేదు. నాకు అవసరంలేదు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు కూడా లేదా?. మా ప్రచారం మమ్మల్ని చేసుకోనివ్వండి. నేను ఏ పార్టీ పేరు ఎత్తి విమర్శలు చేయలేదు. నన్ను ప్రచారం చేయనీయకుండా దాడులు చేస్తున్నారు. ఓట్లు చీలిపోకుండా ఉండాలని నన్ను బెదిరిస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయండి. రాష్ట్రంలో హింసే ఉంది. ఎవరినీ ఎదగనివ్వడంలేదు." - బర్రెలక్క(శిరీష)
యానాం మాజీ మంత్రి విరాళం
బర్రెలక్కకు మద్దతుగా యానాం మాజీ మంత్రి, దిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళం అందించారు. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషతో మల్లాడి కృష్ణారావు ఫోనులో మాట్లాడి అభినందనలు తెలిపారు. బర్రెలక్క శిరీషకు ఒక్క అవకాశం ఇవ్వాలని అని ప్రజలను కోరారు. ప్రశ్నించే వాళ్లు రాజకీయాలల్లోకి రావాలన్నారు. శిరీష ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తానని మల్లాడి కృష్ణారావు హామీ ఇచ్చారు.