CM KCR : కాంగ్రెస్ లో డజను మంది సీఎం అభ్యర్థులు, వచ్చేది 20 సీట్లే- సీఎం కేసీఆర్-khammam news in telugu cm kcr says congress again gets 20 seats in election ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cm Kcr : కాంగ్రెస్ లో డజను మంది సీఎం అభ్యర్థులు, వచ్చేది 20 సీట్లే- సీఎం కేసీఆర్

CM KCR : కాంగ్రెస్ లో డజను మంది సీఎం అభ్యర్థులు, వచ్చేది 20 సీట్లే- సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Nov 21, 2023 03:00 PM IST

CM KCR : ఖమ్మంలో ఈసారి గతంలో కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కూడా 20 సీట్లే గెలుస్తుందన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : ప్రజలపై ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మాకు విరోధి అయినా మధిరలో అభివృద్ధి చేశామన్నారు. మధిరలో భట్టి విక్రమార్క గెలచేది లేదు, సీఎం అయ్యేది లేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని పాలన చేశామన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఏం ఒరిగిందేం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు.

మధిరలో దళితులందరికీ దళిత బంధు

కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వొద్దు, కరెంట్ ఇవ్వొదంటుందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే నష్టమే అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని సీఎం కేసీఆర్‌ జోస్యం చెప్పారు. భట్టి విక్రమార్క మధిరకు ఏం చేయలేదని, ఆయనకు ఓటు వేస్తే నష్టపోతారన్నారు. భట్టి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నాయని సెటైర్లు వేశారు.

కాంగ్రెస్ డ్రామాలు

కాంగ్రెసోళ్లు కొత్త డ్రామా మొద‌లు పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌లో డ‌జ‌ను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వాళ్లు గెలిచేది స‌చ్చేది లేదన్నారు. మ‌ళ్లీ కాంగ్రెస్ కు 20 సీట్ల లోపే వస్తాయన్నారు. మ‌ధిర ప‌ర్యట‌న‌తో 70 నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించానన్న సీఎం కేసీఆర్... మరో 30 నియోజ‌క‌వ‌ర్గాలు వెళ్లాల్సి ఉందన్నారు. ఆ 30 నియోజకవర్గాల్లో పర్యటన ముగిసేనాటికి కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుందన్నారు. గతంలో కంటే రెండు సీట్లు ఎక్కువ మెజార్టీతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వ‌స్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేదన్నారు. భట్టి గెలిస్తే వచ్చేదేం లేదని, ద‌ళిత‌వ‌ర్గం ఒక్క ఓటు కూడా భ‌ట్టి విక్రమార్కకు వేయొద్దని పిలుపునిచ్చారు.

భూమాత కాదు భూమేత

కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉండేది కాదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామన్నారు. ధరణి తీసేసి భూమాత పెడతామంటున్నారని, అది భూమాత కాదు భూమేత అని విమర్శించారు. ఖమ్మం జిల్లాను ఆనుకుని గోదావరి పోతున్నా సాగునీరు అందించాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతలు చేయలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మధిర నియోజకవర్గంలో కరువు అనే మాట వినిపించదన్నారు.

Whats_app_banner